బీఎస్ఎఫ్ తొలి మహిళా ఫ్లైట్ ఇంజినీర్ గా భావనా చౌదరి

సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్ఎఫ్‌)లో తొలి మహిళా ఫ్లైట్‌ ఇంజినీరుగా ఇన్‌స్పెక్టర్‌ భావనా చౌదరి నియమితులయ్యారు. బీఎస్ఎఫ్‌లో విమాన విభాగం 1969లో ఏర్పాటు కాగా, ఇంజినీరు పదవిలో మహిళను నియమించడం ఇదే ప్రథమం. నలుగురు పురుషులతో పాటు శిక్షణ పొందిన భావనకు ఇటీవలే బీఎస్ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ దల్జీత్‌ సింగ్‌ చౌదరి ఫ్లయింగ్‌ బ్యాడ్జెస్‌ను అందజేశారు.

హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన విమానయాన సేవల బాధ్యతను బీఎస్ఎఫ్ చూసుకుంటుంది. పారామిలటరీ దళాలు, ఎన్ఎస్ జీ, ఎన్డీఆర్ఎఫ్ సేవలు చేపట్టే ఆపరేషన్లను కూడా చూసుకుంటుంది. దీంతో ఫ్లైట్ ఇంజినీర్లకు తీవ్ర డిమాండ్ వుంంటుంది. ఈ నేపథ్యంలోనే మహిళల్నీ ఈ విభాగంలోకి తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా భావన చౌదరి రెండు నెలల పాటు శిక్షణ తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *