మధ్యప్రదేశ్‌లోని చారిత్రక భోజ్‌శాలలో కొనసాగుతున్న సర్వే
మధ్యప్రదేశ్‌లోని చారిత్రక భోజ్‌శాలలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే కొనసాగుతోంది. హైదరాబాద్‌కి చెందిన ఆర్కియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మరియు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం భోజ్‌శాల ప్రవేశ ద్వారం దగ్గర గ్రౌండ్ పెనేట్రేటింగ్ రాడార్ అన్న యంత్రంతో ఈ సర్వే కొనసాగిస్తోంది . ఈ సమయంలో ప్రత్యేక ఆకృతిలో వున్న మూడు స్తంభాల అవశేషాలు బయటపడ్డాయి. ఆ మూడు స్తంభాలపై కూడా ప్రత్యేక ఆకారంతో వున్నాయి.మరోవైపు ఈ సర్వే చేస్తున్న సమయంలో అంతా వీడియోలు, ఫొటోలు తీస్తున్నారు . అయితే సర్వేకి సంబంధించిన రిపోర్టును జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు నాలుగు రోజుల్లోగా తయారు చేస్తా రు.
కానీ ఫైనల్ రిపోర్టు మాత్రం పరిశోధన తర్వాతే సమర్పిస్తారు. దీనికి కాస్త సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఈ రిపోర్టు ఆధారంగానే భోజశాలలో ఎక్కడెక్కడ తవ్వాలో నిర్ణయం తీసుకుంటారు. మరో వైపు హిందువుల పక్షాన వున్న గోపాల్ శర్మ మాట్లాడుతూ… మే 29 న క్యాంటీన్ లోపలి, బయటి ఆవరణలో పనులు జరిగాయని, ఉత్తర భాగంలో మట్టి తొలగించే పనులు చేససనట్లు తెలిపారు. గర్భగుడితో పాటు ఇతర ప్రధాన ప్రదేశాల ఫొటోలను తీససనట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ తొలగించే పనుల సమయంలో దేవతల చిహ్నాలు, రెండు స్తంభాలు, మూడు అడుగుల పొడవైన కత్తి, కొన్ని నాణేలు తవ్వకాల్లో దొరికాయని తెలిపారు.