అయోధ్య రామ్ లల్లాను దర్శించుకున్న భూటాన్ ప్రధాని
భూటాన్ ప్రధాని దాషో షెరింగ్ తోబ్గే, తన భార్యతో కలిసి అయోధ్యలోని శ్రీరాముడ్ని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్, ధర్మకర్తలు కలిసి భూటాన్ ప్రధాన మంత్రి, భార్యకు సాదరంగా స్వాగతం పలికారు.తదనంతరం శ్రీరామ దర్బార్ ను సందర్శించి, కుబేర్ టీలా వద్ద శివునికి అభిషేకం, హారతి నిర్వహించారు.తర్వాత అక్కడి నిర్వాహకులు ప్రధానికి ఆలయ విశిష్టత, సముదాయం గురించి వివరించారు. నిర్మాణ వైభవాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యాన్ని తెలియజేశారు. అలాగే కొనసాగుతున్న నిర్మాణ పనుల గురించి, సందర్శన సమయాలు వివరించారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన ఆలయ ప్రాంగణంలో వున్నారు.