వృక్షానికి రాఖీ కట్టి… రక్షా బంధన్ ఉత్సవాలను జరుపుకున్న బిహార్ ముఖ్యమంత్రి
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రక్షా బంధన్ ఉత్సవాలను వెరైటీగా జరుపుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఓ చెట్టుకు రాఖీ కట్టారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. అంతేకాకుండా డిప్యూటీ ముఖ్యమంత్రులతో కలిసి మొక్కలు కూడా నాటారు. బిహార్ లో పచ్చదనం, పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2012 నుంచి రక్షా బంధన్ ను బిహార్ వృక్ష సురక్షా దివస్ గా పాటిస్తోందని అధికారులు తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడి పర్యావరణాన్ని కూడా సంరక్షిస్తామని తెలిపారు.