ఆ ఏడు గ్రామాలకు సాక్షాత్తూ అన్నపూర్ణే…

బిపిన్ దేవీ… దాదాపు ఆరు ఏడు గ్రామాలకు సాక్షాత్తూ అన్నపూర్ణా దేవే. యూపీలోని సోన్ భద్రా జిల్లాలో చాలా మందికి ప్రతి రోజూ మంచి భోజనం ఉచితంగా పెడుతున్నారు. ఓ వ్యాన్ లో తాను వండిన ఆహారాన్ని తీసుకొచ్చి,అందరికీ సుష్ఠుగా భోజనం పెడతారు. ఈ ఆరేడు గ్రామాలు అంత అభివృద్ధి కనిపించదు. వ్యవసాయం, పశుపోషణ మాత్రమే వారి జీవనాధారం. అసలు పరిశ్రమలే కనిపించవు. దీంతో ఆర్థిక వనరులు కూడా అంతంతే. వర్షాలు సరిగ్గా కురువక, దిగుబడి తగ్గిపోయింది. దీంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారింది. దీంతో ఆ కుటుంబాల ఆకలిని తీరుస్తున్నారు బిపిన్ దేవీ.ఈ ప్రాంతాల్లో పసి పిల్లులు కూడా కడుపు మాడ్చుకోవాల్సిన పరిస్థితి. దుస్థితిని చూసి చలించిపోయా. ఈ గ్రామాలకు సహాయం చేద్దామని నా భర్తతో చెప్పా. ఆయనా సరేనన్నారు. దీంతో ఇది ప్రారంభం చేశాం’’ అని తెలిపారు.

బిపిన్ దేవీ భర్త పేరు కల్లు యాదవ్. పెద్ద ధనవంతులేమీ కాదు. సాధారణ కిరాణ దుకాణాన్ని నడుపుకుంటారు. వీరికి ఇద్దరు సంతానం. అయినా.. ఈ గ్రామాల దుస్థితిని చూసి ఈ కుటుంబం మొత్తం చలించిపోయింది. దీంతో ప్రతిరోజూ ఆహారం పెడుతున్నారు. పేదల కష్టాలను ఎలాగైనా తీర్చాలని బిపిన్ దేవీ నిర్ణయించుకుంది. తన కుటుంబీకులతో ఆలోచనను పంచుకుంది. దీంతో వారికి భోజనం పెట్టాలని కుటుంబం మొత్తం నిర్ణయించుకొని, కార్యరూపంలో పెడుతున్నారు.

దీంతో వారికి వుండే వాహనం వ్యాన్ నే మొబైల్ కిచెన్ గా మార్చేశారు. ఆహారం వండి, పంపిణీ చేస్తూ గ్రామాలు తిరుగుతారు. అన్నం, పప్పు, కూరలు వడ్డిస్తారు. వీరికి అన్నం పెట్టడం ద్వారా అపారమైన సంతృప్తిని తాము పొందుతున్నామన్నారు. ఎవరూ ఆకలితో వుండకూడదనే తాము ప్రయత్నిస్తామని, కోవిడ్ మహమ్మారి సమయంలోనూ సేవలందించామని తెలిపారు. ఈ బండిని అందరూ ‘‘చాచీస్ కిచెన్’’అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆ గ్రామాల ప్రజలు కూడా ఈ కుటుంబంతో అనుబంధం పెంచేసుకున్నారు.

నెలలో 20 నుంచి 25 రోజుల పాటు నిత్యం ప్రజలకు ఆహారాన్ని అందిస్తామని బిపిన్ దేవీ తెలిపారు. ప్రతి రోజూ 80 నుంచి 100 మందికి భోజనం పెడతామన్నారు. ఏడాదిన్నర క్రితం ఆహారం వండుతుండగా ప్రమాద వశాత్తు కాలిందని, గాయాలు చాలా బాధించాయని వెల్లడించారు. అయినా ప్రజలు ఆకలితో వుండకూడదని నిర్ణయించుకొని, వారి ఆకలి ముందు తన కాలిన గాయాలు చాలా చిన్నవిగా అనిపించాయని వెల్లడించారు. అయినా ప్రయత్నం సాగించానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *