బిస్కెట్ వ్యూహం పన్నిన భారత సైన్యం… హతమైన ఇస్లామిక్ ఉగ్రవాది
జమ్మూ కశ్మీర్ లో ఇస్లామిక్ ఉగ్రవాదులను భారత సైన్యం ఎప్పటికప్పుడు మట్టుబెడుతూనే వుంది. ఇందుకు రకరకాల వ్యూహాలను అనుసరిస్తోంది. తాజాగా… మన సైన్యం ఉగ్రవాదులను ఏరివేయడంలో బిస్కెట్లను ఉపయోగించింది. విజయవంతం కూడా అయ్యింది. లష్కరే తోయిబాకి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదిని మట్టుబెట్టడానికి సైన్యం బిస్కెట్లను ఉపయోగించి, విజయవంమైంది. అనంత్‌నాగ్ జిల్లా ఖాన్యార్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో బలగాలు రంగంలోకి దిగాయి.
ఈ క్రమంలో సైనికులకు వీధికుక్కల రూపంలో సవాల్ ఎదురైంది. అవి మొరిగితే ఉస్మాన్ తప్పించుకునే అవకాశం ఉంది. దీంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన జవాన్లు అవి అరవకుండా ఉండడానికి దారిపొడవునా శునకాలకు బిస్కెట్లు అందిస్తూ వచ్చారు. ఈ వ్యూహంతో ఆపరేషన్ వియవంతమైందని, ఇలాంటి సమయాల్లో వీధికుక్కల సమస్యకు పరిష్కారం దొరికిందని సీనియర్ అధికారులు తెలిపారు. మరోవైపు, ఆదివారం శ్రీనగర్‌లోని ఆల్‌ఇండియా రేడియో సమీపంలోని టూరిస్టు రిసెప్షన్ సెంటర్ దగ్గరలో గల మార్కెట్ వద్ద ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. రద్దీగా ఉండే వార సంతలో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కనీసం 12 మంది గాయపడ్డారు.