పూల సాగుతో యేడాదికి 70 కోట్ల టర్నోవర్…

వ్యవసాయమే ఆ కుటుంబ జీవనాధారం. చదువుకి డబ్బులు కూడా వుండేవి కావు. అందుకే చదువు కూడా మానేశాడు. నెలకు వెయ్యి రూపాయలే జీతం వచ్చే పనిలో చేరిపోయాడు. కానీ… వ్యవసాయంపై మాత్రం ప్రీతి తగ్గలేదు. పూల తోటలో పనిచేసేవాడు. ఇదే ఆయన్ను సక్సెస్ వైపు మళ్లించింది. పూల తోటలో పని చేసిన అనుభవం బాగా కలిసొచ్చింది. వెంటనే ఇంటికి తిరిగి వచ్చి వ్యవసాయం చేయడం ప్రారంభించాడు.పూలసాగుతో పాటు కోత, మార్కెటింగ్, ఎగుమతి ఇలా అన్ని అంశాల పట్ల ఓ పట్టు తెచ్చుకున్నాడు. ఇక.. అక్కడ పని మానేసి.. తానే స్వయంగా వ్యాపారం మొదలుపెట్టాడు.

మొదట.. చాలా తక్కువ పెట్టుబడితో రైతుల నుంచి పూలు సేకరించి వాటితో వ్యాపారం చేశాడు. 1997లో నగరంలోనే ఓ చిన్న పూల దుకాణం పెట్టాడు. అలా పదేళ్లు పనిచేసిన శ్రీకాంత్.. పూల పెంపకందారులు, పరిశ్రమలో ఉన్న చాల మందితో పరిచయాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం హార్టికల్చర్ విషయంలో ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తుందో అధ్యయనం చేశాడు. అధికారులతో పరిచయాలు పెంచుకున్నాడు. దీంతో నేషనల్ హార్టికల్చర్ బోర్డును సంప్రదించి.. ప్రభుత్వ రుణం తీసుకొని బెంగళూరులోనే దొడ్డబళ్లాపుర సమీపంలోని 10 ఎకరాలతో పూలు సాగుత ప్రారంభించారు. తాను పని చేస్తున్నప్పుడు నేర్చుకున్న మెళకువలకు తోడు.. తన పదేళ్ల వ్యాపార అనుభవాన్ని ఉపయోగించి.. సాగును లభసాటిగా నడిపించాడు. దీంతో.. 10 ఎకరాలతో మొదలుపెట్టిన పూలసాగు.. ప్రస్తుతం 52 ఎకరాలకు చేరింది. 52 ఎకరాల పొలంలో గులాబీలు, జెర్బెరా, కార్నేషన్లు, జిప్సోఫిలా.. ఇలా 12 రకాలకుపైగా పూలను సాగు చేస్తున్నాడు శ్రీకాంత్. ఈ పూలసాగుతో ఏడాదికి దాదాపు 70 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాడు. దాదాపు 200 మందికి ఉపాధినిస్తున్నాడు.

తాను మొదట్లో ఉపాధి కోసమే ఇబ్బందులు పడేవాడినని, డబ్బును చూసేవాడినే కాదనని శ్రీకాంత్ పాత రోజులు గుర్తు చేసుకున్నాడు. కానీ… వ్యవసాయమే తిరిగి తనను ప్రపంచానికి పరిచయం చేసిందని గర్వపడ్డాడు. తాను ఇంతలా ఎదగడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు చాలా సహకరించారని, అధ్యయనం కూడా స్వతహాగా చేశానన వెల్లడించాడు. ఇప్పుడు 200 మందికి ఉపాధి కల్పిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *