గోల్కొండ సాహితీ మహోత్సవం 2021 – ‘‘స్మరణీయులు’’ పుస్తక ఆవిష్కరణ

గోల్కొండ సాహితీ మహోత్సవం – 2021 ‘‘స్మరణీయులు’’ సావనీర్‌ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం అక్టోబర్‌ 26 ‌సాయంత్రం హైదరాబాద్‌ ‌లోని కేశవ్‌ ‌మెమోరియల్‌ ‌ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సమాచార భారతి అధ్యక్షులు శ్రీ గోపాల్‌ ‌రెడ్డి గారు, గోల్కోండ సాహితీ మహోత్సవ కన్వీనర్‌ శ్రీ ‌కసిరెడ్డి వెంకట్‌రెడ్డి గారు, శ్రీ జి.వల్లీశ్వర్‌ ‌గారు, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తెలంగాణ ప్రాంత కార్యకారిణి సదస్యులు శ్రీ అన్నదానం సుబ్రమణ్యం గారు, ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముక్‌ శ్రీ ఆయుష్‌ ‌నడింపల్లి గారు పాల్గొని సావనీర్‌ ‌విడుదల చేశారు. ఈ సందర్భంగా సమాచార భారతి అధ్యక్షులు శ్రీ గోపాల్‌ ‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘మన చరిత్ర రచనలో ముఖ్యంగా ఇందిరాగాంధీ హయాంలో జరిగిన అపారమైన వక్రీకరణ తర్వాత కనీసం ఇప్పటికైనా మన నిజమైన చరిత్ర రాయాల్సిన అవసరం ఉందన్నారు.

డాక్టర్‌ ‌కసిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కర్మన్‌ఘాట్‌ ‌హనుమాన్‌ ‌దేవాలయంపై జరిపిన పరిశోధనల్లో కాకతీయ సామ్రాజ్యానికి చెందిన రుద్రదేవుడు ఆలయాన్ని నిర్మించినట్లు తేలిందన్నారు. ఆయనే గోల్కొండ కోటను నిర్మించాడని, హుస్సేన్‌ ‌సాగర్‌ ‌కట్ట నిర్మాణాన్ని ప్రారంభించాడని ఈ వాస్తవాలన్నీ ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే అని ఆయన గుర్తు చేశారు.. శ్రీ వల్లీశ్వర్‌ ‌గారు మాట్లాడుతూ నాటి ప్రజల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత నేడు మనపై ఉన్నందున ఈ పుస్తకానికి ‘స్మరణీయులు’ అనే పేరును పెట్టినట్లు తెలిపారు.  శ్రీ అన్నదానం సుబ్రహ్మణ్యం తన ముఖ్య ఉపన్యాసంలో మాట్లాడుతూ అనేక సంస్థల సహకారంతో +•ఖీ ఘనవిజయం సాధిం చిందన్నారు.

అనంతరం శ్రీ ఆయుష్‌ ‌నడింపల్లి గారు మాట్లాడుతూ చరిత్ర, సమాజం పట్ల ప్రజల దృష్టి కోణాన్ని సదిశలో తీసుకెళ్లెందుకే ప్రచార విభాగం, సమాచారభారతిలను ప్రారంభించామని, అదే దిశలో కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. నిజమైన చరిత్రలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే గత సంవత్సరం గొల్కోండ సాహితీ మహోత్సవం అనే కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌ 11‌న హిందీలో గొల్కొండ సాహితీ మహోత్సవం నిర్వహించడానికి సిద్ధమైన్టు ఆయన తెలిపారు. గోల్కొండ సాహితీ మహోత్సవ నిర్వహణలో పాలుపంచుకున్న ఇతిహాస సంకలన సమితి, ప్రజ్ఞాభారతి, సంస్కారభారతి తదితర సంస్థల ప్రతినిధులు తమ అనుభవాలను వివరించారు. కళ్యాణ్‌ ‌చక్రవర్తిగారి వందన సమర్ఫణతో కార్యక్రమం ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *