బొప్పాయి

గృహిణులు బొప్పాయి గురించి తెలియని వారుండరు, అవును కదా…

బొప్పాయి ముక్కలు ఆకులు… గింజలు… అన్నీ ఔషధాలు… నిజంగా మనకు దేవుడు ఎన్నో వరాలు ఇచ్చేడు, మజ్జ ధాతు (పశీఅవ ఎaతీతీశీష) నిర్మాణంకి ఎంతో మేలు చేస్తుంది. తెల్ల రక్తకణాలు.. ఎర్ర రక్తకణాలు పెంచే ఔషధం. గింజలు లివర్‌కి మంచిది. ఇందులో లభించే పెప్సీన్‌ అనే ఎంజైమ్‌ మనం తినే ఆహారంలోని ప్రోటీన్‌లను జీర్ణం చేస్తుంది.

వంద గ్రాముల బొప్పాయిలో 60 నుంచి 126 మిల్లీ గ్రాముల విటమిన్‌ సి ఉంటుంది. అందుకే ఇది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. చిగుళ్లవాపును, రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ పండులో విటమిన్‌ డి కూడా అధికంగా ఉంటుంది. సూర్యరశ్మి ద్వారా లభించే మొత్తంతో పోల్చితే ఇది చాలా ఎక్కువ.

ఇంకా బొప్పాయి పండు ఎన్ని విధాలుగా మనకు  మేలు చేస్తాయో.. చెప్పనే అక్కర్లేదు. ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే చెట్టు. వారానికి ఒక్కసారి.. ఆకుల రసం తీసుకోవాలి.

పండు తినడం..

అలాగే అమ్మాయిలు పండు గుజ్జుని ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేయాలి.. ముఖ సౌందర్యం రెట్టింపు అవుతుంది.

ఉపయోగాలు…

–      బొప్పాయి మలబద్ధకాన్ని పోగొడుతుంది.

–      ఆహారాన్ని వెంటనే అరిగేలా చేస్తుంది.

–       టీబీని నివారిస్తుంది.

–        రక్తంలో కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది.

–      రక్తంలోని దోషాలను నివారిస్తుంది.

–        రక్త ప్రసరణ పెరగడానికి దోహదపడుతుంది.

–        వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.

–        కడుపులోని యాసిడ్స్‌ను కంట్రోల్‌ చేస్తుంది.

మరి ఈ చెట్టును కాపాడదామా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *