బయోగ్యాస్ తయారీలో బ్రహ్మజెముడు వినియోగం… సరికొత్త ప్రయోగం

ముళ్లులేని బ్రహ్మజముడును కరువు ప్రాంతాల్లో ఎండాకాలంలోనూ పశుగ్రాసం కోసం వినియోగిస్తామనే విన్నాం. కానీ.. ఇప్పుడు దీనిని మరో రకంగా కూడా ఉపయోగిస్తున్నారు. ముళ్లులేని బ్రహ్మజెముడు నుంచి బయోగ్యాస్ ను కూడా ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు ప్రకటించారు. మరోవైపు కొంత మంది రైతులు కూడా ఈ దిశగా అడుగులు కూడా వేశారు. బయో గ్యాస్ ఉత్పత్తికి ప్రస్తుతం పశువుల పేడకు బదులుగా కొంత బ్రహ్మజెముడు మొక్కల్ని కూడా వాడొచ్చని దీంతో రుజువైంది. అయితే.. దీనిపై మరింత ప్రయోగాలు జరగాల్సి వుంది.

 

ఒకవేళ ఇది బాగా పెరిగితే మాత్రం బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియలో కొత్త ఆవిష్కరణలు జరిగినట్లేనని అధికారులు అంటున్నారు. యూపీలోని ఇండియన్ గ్రాస్ ల్యాండ్ అండ్ ఫోడర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో బ్రహ్మజెముడిని బయోగ్యాస్ లో వినియోగించడంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. అత్యంత కరువు ప్రాంతమైన బుందేల్ ఖండ్ లో బయోగ్యాస్ ఉత్పత్తిని పెంపొందించడమే ఈ ప్రయోగాల వెనుక వున్న ముఖ్య ఉద్దేశమని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతానికి బయోగ్యాస్ ద్వారా 65 శాతం బయోమిథేన్ ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ తాజా ప్రయోగంతో పేడను తగ్గించి, బ్రహ్మజెముడును వాడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *