భారత్‌ అమ్ముల పొదిలో బ్రహ్మోస్‌

‌భారత్‌ ఈ ఏడాది 10 బ్రహ్మోస్‌ ‌క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. ఈ ఏడాది జనవరి 11న INS విశాఖపట్నం వేదికగా అధునాతన క్షిపణి సముద్రం నుంచి సముద్రం వరకు పరీక్షించడం ప్రారంభించి, భారతదేశం ఈ ఏడాది 10 బ్రహ్మోస్‌ ‌సూపర్‌సోనిక్‌ ‌క్రూయిజ్‌ ‌క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది.

ఈ ప్రయోగాలు కొన్ని నూతన ఉపవ్యవస్థ లను ధృవీకరించడానికి నిర్వహించారు. క్షిపణి నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని తగ్గించడానికి, అలాగే క్షిపణిలో ఉపయోగించే కొన్ని క్లిష్టమైన భాగాల కోసం రష్యా వంటి విదేశాలపై ఆధార పడకుండా దేశీయంగా సాంకేతిక సామర్థ్యాన్ని పెంచడం కోసం వైమానిక దళం కృషి చేస్తోంది.

తాజాగా భారత వైమానిక దళానికి చెందిన Su-30 MKI యుద్ధ విమానం నుంచి ప్రయో గించిన క్షిపణి మిగతా ప్రయోగాల కంటే భిన్నమైనది. గగనవీధిలో 450 కి.మీల పరిధిలో బ్రహ్మోస్‌ను పరీక్షించడం ఇదే మొదటిసారి. ఈ ప్రయోగంతో Su-30 MKI విమానం నుంచి భూమి/సముద్ర సుదూర లక్ష్యాలను ఖచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యాన్ని భారత వైమానిక దళం (IAF) సాధించింది’’ అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ Su-30 MKI యుద్ధ విమానం మలేషియా, సింగపూర్‌ ‌మధ్య ఇరుకైన సముద్ర మార్గమైన మలక్కా జలసంధితో సహా తూర్పున ఉన్న వివిధ సన్నని మార్గాల ద్వారా హిందూ మహా సముద్రంలోకి వచ్చే యుద్ధనౌకలు, ఓడలను గట్టిగా ఎదుర్కొంటుంది.

‘‘450 కి.మీ.ల కంటే ఎక్కువ పరిధి కలిగిన బ్రహ్మోస్‌ ‌క్షిపణిని గగనతలం నుంచి పరీక్షించడం ఇదే మొదటిసారి. దాదాపు 1,500 కి.మీ మేర పోరాట సామర్థ్యం కలిగి ఉంది, అలాగే 450 కి.మీ.ల పరిధిలో పటిష్టమైన ఆయుధ సామగ్రిని తీసుకెళ్లగలద్న’’ అని ఒకానొక అధికారి తెలిపారు.

చైనా వాణిజ్యంలో దాదాపు 80 శాతం చమురు సరఫరా ఈ ఇరుకైన 500 నాటికల్‌-‌మైళ్ల పొడవైన జలమార్గం గుండా వెళుతుంది. కాబట్టి ఈ క్షిపణి చైనాకు తలనొప్పిగా మారే అవకాశం ఉంటుందని, అలాగే హిందూ మహా సముద్రంలోని దక్షిణ, పశ్చిమ లక్ష్యాలను కూడా క్షిపణి చేధించగదని అధికారులు చెబుతున్నారు. భారత వైమానిక దళం ఇప్పటికే తమిళనాడులోని తంజావూరు ఎయిర్‌ఫోర్స్ ‌స్టేషన్‌లో బ్రహ్మోస్‌-‌సాయుధ Su-30 MKIలను నిర్వహించే నంబర్‌ 222 ‌స్క్వాడ్రన్‌ ‘‌టైగర్‌షార్కస్’‌ని మోహరించింది.

2021లో, బ్రహ్మోస్‌తో సాయుధమైన Su-30 MKI విమానాలు హిందూ మహాసముద్రంలో అమెరికా నావికాదళంతో కలిసి విన్యాసాల్లో పాల్గొన్నాయి. బ్రహ్మోస్‌-‌సాయుధ స్క్వాడ్రన్‌.. ‌సముద్రపు దాడులను సాధన చేయడానికి అనుమతించింది. ప్రయోగంలో భాగంగా 2020లో పంజాబ్‌లోని ఒక స్థావరం నుంచి క్షిపణి ఎయిర్‌-‌లాంచ్‌ ‌వెర్షన్‌తో బయలుదేరిన Su-30 MKI ఫైటర్‌ ‌హిందూ మహాసముద్రంలో లక్ష్యాన్ని ఛేదించింది. దాదాపు 4,000 కి.మీ.ల దూరంలో ఉన్న హిందూ మహాసముద్రంలో ఒక లక్ష్యాన్ని లోతుగా ఛేదించింది. అతి పొడవైన బ్రహ్మోస్‌ ‌మిషన్‌ ‌దానిని ప్రయోగించాల్సిన ప్రదేశానికి చేరుకోవడానికి దాని ప్రయాణంలోనే గగనవీధిలో ఇంధనం నింపుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *