అబుదాబిలోని ABPS ఆలయాన్ని సందర్శించిన 2.5 మిలియన్ల భక్తులు

గత యేడాదిలో అబుదాబిలోని BAPS ఆలయాన్ని అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు సందర్శించారని ఆధ్యాత్మిక గురువు బ్రహ్మ విహారి స్వామి అన్నారు. యేడాదిలో 2.5 మిలియన్ల ప్రజలు సందర్శించుకున్నారని తెలిపారు. అబుదాబిలోని ఈ ఆలయం ప్రపంచ సామరస్యానికి ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని, ఇక్కడికి వచ్చిన వారు గొప్ప ఆనందంతో తిరిగి వెళ్తున్నారని అన్నారు.ఈ ఆలయాన్ని అబుదాబి పాలకుడు షేక్ మహ్మద్ బిన్ జాయోద్ అల్ నహ్యాన్ బహుమతిగా ఇచ్చారని, మహంత స్వామి మహారాజ్ సారథ్యంలో ఇది నిర్మితమైందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మరింత సామరస్యతను నెలకొల్పుతుందని ప్రధాని మోదీ కూడా అన్నారని గుర్తు చేశారు.
ఈ మందిర నిర్మాణానికి అవసరమైన ఇటుకలను 70 వేల మందికి పైగా ఇచ్చారని బ్రహ్మ విహారి తెలిపారు.మత సామరస్యం అనేది అత్యంత ముఖ్యమైన విషయంగా అభివర్ణించారు. అలాగే కుటుంబ వ్యవస్థ కూడా ప్రముఖ పాత్రపోషిస్తుందన్నారు. బలమైన దేశాలు కూడా సామరస్యంగా లేకపోతే అవి దుష్ట దేశాలే అవుతాయని స్వామీజీ అన్నారు. అయితే సామరస్యాన్ని కేవలం మతం మాత్రమే సృష్టించలేదని, వృత్తి, విద్యా రంగం.. ఇలా ఏ రంగమైనా సామరస్యాన్ని చెప్పే విధంగా వుండాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *