బీఎస్ఎఫ్ జవాన్ ను కిడ్నాప్ చేసిన బంగ్లాదేశ్ జాతీయులు
బంగ్లాదేశ్ వాసులు బీఎస్ఎఫ్ జవాన్ ను కిడ్నాప్ చేశారు. కొన్ని గంటల పాటు బందీగా వుంచుకొని, ఆ తర్వాత విడుదల చేశారు. బెంగాల్ లోని ముర్షిదాబాద్ లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. నుర్పుర్ జిల్లా సుతిర బీఎస్ఎఫ్ క్యాంప్ సమీపంలోని చాందినీ చౌక్ వద్ద గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది.
కథాలియ అనే గ్రామం వద్ద బంగ్లావైపు నుంచి కొందరు చొరబడుతుండటాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గమనించారు. వారిని నిలువరించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో బంగ్లాదేశీయులు జవాన్ ను కిడ్నాప్ చేశారు.ఈ విషయంపై బీఎస్ఎఫ్ అధికారులు స్పందించారు.
‘‘మా జవాన్ ను బంగ్లాదేశీయులు కిడ్నాప్ చేశారు. కొన్ని గంటల పాటు బందీగా వుంచారు. దీంతో ఈ విషయాన్ని ‘‘బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్’’ కి చెప్పాం. దీంతో కొన్ని గంటల్లోనే అతడ్ని విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆ జవాన్ క్షేమంగానే వున్నాడు’’ అని తెలిపారు.