2,500 కిలోమీటర్ల ర్యాఫ్టింగ్ చేస్తూ గంగానది పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు
మహిళలు పూనుకుంటే జరగది అంటూ ఏదీ వుండదు. చిన్న పనైనా.. పెద్ద పనైనా… అందునా భారత ఆర్మీకి సంబంధించిన వారంటే… మొండి పట్టే. ఈ మొండిపట్టుతోనే BSF మహిళా జవాన్లు గంగానది స్వచ్ఛతపై అందరికీ అవగాహన కల్పిస్తున్నరు. ‘‘స్వచ్ఛగంగా’’ పేరుతో ఉద్యమ ప్రచారాన్ని ప్రారంభించారు. గంగానదిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం, ఆవశ్యకతను వివరించడానికి 20 మంది మహిళా జవాన్లు గంగనదిపై నవంబర్ మాసంలో గంగానదిపై తెప్పలతో ర్యాలీగా బయల్దేరారు. ఉత్తరాఖండ్, తెహ్రీ ఘరేవాల్ జిల్లాలోని దేవ ప్రయాగ పట్టణం నుంచి మొదలైన ‘‘ఆల్ ఉమెన్ రివర్ ర్యాఫ్టింగ్’’’2,500 కిలోమీటర్లు జరగనుంది. మొత్తం 53 రోజుల పాటు ప్రయాణించి, డిసెంబర్ 26 న బెంగాల్ లని గంగాసాగర్ వద్ద ముగుస్తుంది.
ఇలా మహిళలందరితో రివర్ ర్యాఫ్టింగ్ జరగడం ఇదే ప్రథమం. బీఎస్ఎఫ్ మహిళా విభాగం, నమామి గంగే ప్రాజెక్టు ఉమ్మడిగా దీనిని నిర్వహిస్తోంది. ర్యాఫ్టింగ్ ప్రారంభానికి ముందు మహిళా శక్తికి సంకేతంగా 11 మంది బాలికల పాదాలకు నమస్కరించి, బాల పూజ చేశారు. ఈ ర్యాఫ్టింగ్ కి బీఎస్ఎఫ్ ఇన్ స్పెక్టర్ ప్రియా మీనా నాయకత్వం వహిస్తున్నారు.
అయితే.. ఈ ర్యాఫ్టింగ్ లో పాల్గొన్న మహిళా జవాన్లకు కొన్ని రోజుల పాటు శిక్షణనిచ్చారు. రెండు తెప్పలుగా సాగే ఈ బోటింగ్ యాత్రలో 43 పట్టణాలు వస్తాయి. ఈ పట్టణాలలో గంగానది పరిశుభ్రత ఆవశ్యకత, చెత్త తొలగించడంపై అవగాహన కలిగిస్తారు.