పనికిరాని బాటిల్స్ తో బస్సు స్టాండ్ నిర్మాణం… ఎకో ఫ్రెండ్లీ సోదరులు వీరు
హైదరాబాద్ లోని స్వరూప్ కాలనీ వాసులు పెట్ బాటిల్స్‌తో ఏకంగా బస్సు షెల్టర్ నిర్మించేశారు. కాలనీ వాసులకు బస్సు షెల్టర్ లేకపోవడంతో బ్యాంబు హౌజ్ ఇండియా కో పార్టనర్స్ ప్రశాంత్, అరుణ్ ఈ బృహత్తర పనికి పూనుకున్నారు. గతంలో వీరు వెదురుతో ఇళ్లను కూడా నిర్మించి, పర్యావరణ హితులుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు పెట్ బాటిల్స్‌తో బస్ షెల్టర్ చేశారు. దీని కోసం 1000 పెట్ బాటిళ్లను ఉపయోగించారు.84 అడుగుల బస్సు షెల్టర్ నిర్మాణం అయ్యింది. షల్టర్ చట్రాన్ని వెదురు దుంగలతో చేసస, ఖాళీ బాటిళ్లను దుంగల మధ్య నుంచి లాగిన ఒక తాడు సహాయంతో నిలువుగా బిగించి కట్టారు. బాటిళ్ల మధ్యలో వున్న ఖాళీల నుంచి గాలి ప్రసారం కావడం వల్ల ఈ ప్రదేశం చల్లగా వుంటుంది.
ఈ నిర్మాణాన్ని తాము సవాలుగా తీసుకున్నట్లు తెలిపారు. ఇతర దేశాల్లో ఈ నిర్మాణాలు ఇప్పటికే వున్నాయని పేర్కొన్నారు.కానీ.. భారత్‌లో చాలా తక్కువ అని సోదరులు పేర్కొన్నారు. అయితే తమకు మాత్రం కాస్త అవగాహన వుందని, అందుకే ఈ సవహసం చేశారు. బాటిళ్లను నేలబారుగా పరిచి, వాటిపై మరికొన్ని నిలువుగా నిలబెట్టి ఓ గోడ కట్టారు. బాటిళ్లను వాటి స్థానాల్లో కదలకుండా ఉంచడానికి వెదురు చట్రాన్ని చికెన్ మెషషను ఉపయోగించారు. మట్టి, సిమెంట్ పైపూత పూశారు.
మొదట్లో ఖాళీ సీసాలు వాడారు. మట్టి, సిమెంట్ , ప్లాస్టరింగ్ కింద సీసాలు నలిగిపోయాయి. అందువల్ల గోడను కూల్చేసీ , సీసాల్లో మట్టి నింపి, మళ్లీ నిర్మించారు. దాంతో గోడ దృఢంగా, మేకులు దింపడానికి కూడా వీలుండే విధంగా 15 15 అడుగుల గది సిద్ధమైంది . దీనికి 7000 పెట్ బాటిళ్లను ఉపయోగించారు. ఇటుక కంటే పెట్ బాటిళ్లు చాలా తక్కువ. ప్లాస్టరింగ్ మొత్తం ససమెంట్‌తో కాదు కనుక ఖర్చు తగ్గుతుంది. కానీ ఖాళీ బాటిళ్లను సేకరించాల్సి వచ్చిందని, అప్పుడప్పుడు 10 రూపాయలు చెల్లించి వాటిని కొనాల్సి వచ్చిందని అన్నారు. తాపీ మేస్త్రి సహాయం దొరకడం కూడా కష్టమైందని, కానీ చివరికి సవధ్యమైందన్నారు. బాటిళ్లు వృత్తాకారంగా వుంటాయని, కాబట్టి ఈ నిర్మాణాలు ఇటుకల కంటే ఎంతో ధృఢంగా వుంటాయన్నారు.
సససవలను నిలువుగా నిలబెట్టి గోడ నిర్మించడం ఒక సవాలే. నేల బారు నమూనా చాలా తేలిక. 500 మి.లీ., 1లీ., 2లీ. వంటి వివిధ రకాల పరిమాణాల సీసాలతో నిర్మించామని, అది ధ్వంసస కావడం అసవధ్యమన్నారు. గది నిర్మించగా మిగిలిన సససవలతో నీటి తొట్టె నిర్మించారు. ఈ తొట్టెకు దాదాపు 5000 సీసాలను ఉపయోగించారు.