సంఘ్ సమాజంలో అంతర్భాగం : సీఎస్ ముకుంద

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంద సంవత్సరాల మైలు రాయి అనేది కేవలం వేడుక కాదని, అంతకంటే ఎక్కువ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ ముకుంద అన్నారు. ఆరెస్సెస్ అనేది సమాజంలో ఓ సంస్థ కాదని, అది సమాజ సంస్థ అని అభివర్నించారు. కర్నాటకలోని ‘‘థింకర్స్ ఫోరం’’ ఆధ్వర్యంలో యంగ్ థింకర్స్ మీట్ నిర్వహించారు. ఇందులో సీఆర్ ముకుంద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ్ సమాజంలో అంతర్భాగమని, స్వయంసేవకులు దాని స్తంభాలు అని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా నేడు 80 వేలకు పైగా శాఖలు నడుస్తున్నాయని, ఇది సంఘ తత్వం ఆధారంగా విస్తరిస్తున్నాయని వివరించారు.

సంఘ్ కి మరో ప్రత్యేక లక్షణం కూడా వుందని, వంద సంవత్సరాల తర్వాత కూడా అత్యంత పురాతన సంస్థలలో ఒకటిగా వుందని, అలాగే యువకుల సంస్థ అని కూడా పిలుస్తారన్నారు. ఇప్పటికీ అత్యంత చురుగ్గా, వేగంగా విస్తరిస్తోందని, సేవకు మరింత కట్టుబడి వుందని తెలిపారు.ఉదాహరణకు, RSS శిబిర కార్యకర్తల సగటు వయస్సు 16 సంవత్సరాలు, ఇది ఒక అద్భుతమైన అంశం. ఇది RSS లో వృద్ధి చెందుతున్న యవ్వనం మరియు శక్తికి నిదర్శనం అని తెలిపారు. అందుకే సంఘ్ చేపట్టే కార్యక్రమాలు యువతను దృష్టిలో పెట్టుకొనే యోజన చేస్తామని, జాతి నిర్మాణం కోసం ప్రేరేపించే దిశగా, ప్రోత్సహించే దిశగానే వుంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *