సీఏఏ కింద మొదటి 14 మందికి భారత పౌరసత్వం

పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలులోకి వచ్చిన నేపథ్యంలో భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను భారత ప్రభుత్వం వేగిరం చేసింది. ఇందులో భాగంగా తొలిసారి 14 మందికి భారత పౌరసత్వాన్ని, దానికి సంబంధించిన సర్టిఫికెట్లను ఢల్లీి వేదికగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో ఢల్లీిలో మరో 300 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

దేశంలో సీఏఏ అమలుపై ఈ యేడాది మార్చి మాసంలో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2019 డిసెంబర్‌లో ప్రతిపక్షాల నిరసనల మధ్య సీఏఏ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. తర్వాత రాష్ట్రపతి సమ్మతి లభించింది. సీఏఏ చట్టం ప్రకారం పాకిస్థాన్‌, బంగ్లా, ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకి భారత పౌరసత్వం ఇవ్వాలని వుంది. ఈ మేరకు కేంద్రం పలు నిబంధనలు రూపొందించింది. 2014 డిసెంబర్‌ 31 కంటే ముందు పై 3 దేశాల నుంచి భారత్‌కి వలస వచ్చిన హిందువులు, క్రైస్త వులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌ వేదికగానే జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *