సీఏఏ చట్టం అమలుకు కేంద్రం నిబంధనలు
పౌరసత్వ సవరణ చట్టం (CAA)ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. బిల్లు ఆమోదం పొందిన నాలుగేళ్ల తర్వాత చట్టరూపం దాల్చింది. సీసీఏ చట్టాన్ని అమలుపరుస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి భారత్లోకి ప్రవేశించిన ముస్లిమేతరులకు పౌరసత్వ ప్రక్రియను వేగవంతం చేయడానికి పార్లమెంటు చట్టాన్ని ఆమోదించిన నాలుగేళ్ల తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ) కోసం నిబంధనలను నోటిఫై చేసింది.
అయితే ముస్లింల సంగతేంటంటూ సంతుష్టీ కరణీకులు ఎప్పటిలాగే ప్రశ్న లేవనెత్తుతున్నారు. సీఏఏ అమలు వల్ల దేశంలోని మైనారిటీలు, విశేషంగా ముస్లింలు భయపడాల్సిన పనే లేదు. సీఏఏ అమలు వల్ల వారెవ్వరూ తమ పౌరసత్వాన్ని కోల్పోరు. అలాగే వారి హక్కులను కూడా కోల్పోరు. సీఏఏ అనేది పౌరసత్వాన్ని ప్రసాదించేదే కానీ.. పౌరసత్వాన్ని తొలగించే చట్టం ఎంత మాత్రమూ కాదు. ఈ విషయాన్ని ముస్లిం సమాజం గుర్తుంచు కోవాలి. ఈ విషయంలో ముస్లిం సంతుష్టీకరణ చేయడంలో సిద్ధహస్తుల్కెన వారి మాటలను, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ రకాల అపోహలను ప్రచారం చేస్తున్న వారి మాటలను ముస్లిం సమాజం ఏ మాత్రం పట్టించుకోవద్దు. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు కూడా. ‘‘కేంద్ర హోంమంత్రి మాటలపై అందరూ విశ్వాసం చూపించాలి. వారు అధిక సంఖ్యాకుల్కెనా సరే.. అల్ప సంఖ్యాకుల్కెనా సరే..’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.