సి.ఏ.ఏ కచ్చితంగా అమలు చేయాలి.. శిరోమణి అకాలీదళ్
పౌరసత్వ సవరణ చట్టానికి (సిఎఎ) ఇటీవల కాలంలో మద్దతు పెరుగుతోంది. సి.ఏ.ఏ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సమయంలో దానికి వ్యతిరేకంగా అనేక ఆందోళనలు జరిగాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అనేక మంది అప్పుడు వ్యతిరేకించిన వారే ఇప్పుడు సి.ఎ.ఎ కి మద్దతు తెలుపుతున్నారు. సి.ఎ.ఎ అవశ్యకతను తెలుసుకుని భారతదేశంలో సి.ఏ.ఏ తప్పని సరిగా అమలు చేయాలని తమ అభిప్రాయా లను వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వారిలో శిరోమణి అకాలీదళ్ నాయకుడు మంజీందర్ ఎస్ సిర్సా కూడా ఒకరు.
దేశంలో సి.ఎ.ఎ చట్టాన్ని అమలుచేయాలని ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి పౌరులను భారతదేశం తరలిస్తున్న సమయంలో ఆయన ఈ అభ్యర్థన చేశారు.
‘‘ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో ఈ చట్టాన్ని అవసరం. ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే ప్రజలు ప్రయోజనం పొందడానికి ఇక్కడ సురక్షితమైన జీవితాన్ని గడపడానికి వారి పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి వీలుగా చట్టంలో పేర్కొన్న గడువును 2014 నుండి 2021 పొడిగించాలని ప్రధాని, హోంమంత్రిని అభ్యర్థిస్తున్నాను’’ అని అన్నారు.