బస్తర్ లో సరికొత్త అధ్యాయం.. లొంగిపోయిన నక్సల్స్ సారథ్యంలో ‘‘కేఫ్ పాండుమ్’’ ప్రారంభం

నక్సలిజాన్ని వీడి, జన జీవన స్రవంతిలో కలిసిపోయిన మాజీ మావోయిస్టులకి సంబంధించిన ఓ కేఫ్ ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో ప్రారంభమైంది. దీనికి ‘‘కేఫ్ పాండుమ్’’ అని పేరు పెట్టారు. దీనిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రారంభించారు. ఈ కేఫ్ ప్రారంభం అనేది బస్తర్ లో సామాజిక ఆర్థిక పరివర్తనలో కీలకమైన మలుపు. అలాగే మావోయిస్టు ప్రాబల్యం వున్న ప్రాంతంలో మాజీ నక్సల్స్ నడపడం అనేది సరికొత్త అధ్యాయానికి నాంది ప్రస్తావన జరిగినట్లైంది.

నక్సలైట్ బాధితుల కోసం, లొంగిపోయిన నక్సల్స్ కోసం అక్కడి ప్రభుత్వం చూపించిన ముఖ్యమైన చొరవ. హింసను విడనాడి, జన జీవన స్రవంతిలోకి తిరిగి వచ్చిన వారు గౌరవ ప్రదంగా తమ జీవనాన్ని సాగించడానికి, అలాగే వారికి స్థిరమైన జీవనోపాధిని కలిగించడానికి అక్కడి ప్రభుత్వం కృషి చేస్తోంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కేఫ్ ను ప్రారంభించి, అక్కడి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. “నక్సలిజం నిర్మూలన దిశగా బస్తర్ ప్రాంతంలో జరుగుతున్న సానుకూల మార్పుకు పాండుం కేఫ్ ప్రారంభం ఒక స్ఫూర్తిదాయకమైన చిహ్నం” అని ప్రకటించారు. అలాగే ఈ కేఫ్ అనేది శాంతి, ఆశావాదానికి, పురోగతికి ప్రతీక అని కూడా పేర్కొన్నారు.

ఈ కేఫ్ ను నడిపే మాజీ మావోయిస్టులు దీనిపై స్పందించారు. “మేము గతంలో చీకటిని చూశాం. నేడు సమాజానికి సేవ చేసే అవకాశం లభించింది. ఇది మాకు కొత్త జన్మ. గన్‌పౌడర్‌కు బదులుగా కాఫీని అందిస్తూ, కష్టపడి సంపాదించిన డబ్బుతో జీవిస్తున్న ఈ భావన మాకు శాంతిని, గౌరవాన్ని ఇస్తోంది” అంటూ సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక కేఫ్ సిబ్బందిలోనే మరో వ్యక్తి, మాజీ మావోయిస్టు స్పందిస్తూ.. ‘‘జన జీవన స్రవంతిలో కలవడం కష్టమనుకున్నాం. కానీ పోలీసుసిబ్బంది, పరిపాలనా సిబ్బంది అత్యంత నమ్మకంతో మాకు శిక్షణనిచ్చారు. గతంలో చేసిన తప్పులను ఇప్పుడు సవరించుకుంటున్నాం. శాంతి యుతంగా జీవించడానికి మాకు అవకాశం లభించింది. తగిన మార్గాన్ని చూపించారు’’ అని తెలిపారు.

 

మరో మాజీ నక్సల్ కూడా స్పందించాడు. ‘‘మా పండం కేఫ్ బస్తర్ ప్రాంత సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ‘‘‘Where every cup tells a story’ అన్న ట్యాగ్ లైన్ పెట్టుకున్నాం. ఇక్కడ అందించే కాఫీ రుచిని మాత్రమే కాకుండా ధైర్యం, పోరాటంపై విజయం, కొత్త ఇన్నింగ్స్ ప్రారంభం, కొత్త కథను కూడా వచ్చిన వారికి ఇస్తుంది’’ అని తెలిపాడు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *