దేశీయ వ్యవస్థలతోనే పాక్ పై దాడి : సీడీఎస్ అనిల్ చౌహాన్

తాము దేశీయంగా బలోపేతం చేసుకున్న వ్యవస్థలతోనే ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు సీడీఎస్ అనిల్ చౌహాన్ ప్రకటించారు. భారత్ ఆకాశ్ వంటి స్వదేశీ వ్యవస్థలనే ఉపయోగించిందని, స్పేస్, శాటిలైట్, ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులో వుందన్నారు. తాము సొంత శాటిలైట్ వనరులతో సమర్థవంతంగా ఉగ్రశిబిరాలపై దాడులు నిర్వహించామన్నారు. శనివారం సింగపూర్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా అనిల్ చౌహాన్ మాట్లాడుతూ.. ఆధునిక రక్షణ వ్యవస్థలో సొంతంగా నిలదొక్కుకుంటున్నామని, ఆత్మ నిర్భర్ భారత్ తోనే ఇది సాధ్యమవుతుందన్నారు. భారత్ తన సొంత శక్తిపై ఆధారపడితే.. పాకిస్తాన్ మాత్రం చైనా లేదా విదేశీ శాటిలైట్ చిత్రాలపై దాయది ఆధారపడిందని విమర్శించారు. అయితే.. వారికి ఏ దేశం నుంచి అవి అందాయో స్పష్టంగా తెలియదు కానీ.. వారి మిత్ర దేశాల నుంచే అంది వుండవచ్చని అన్నారు.

భారత్ లోని స్టార్టప్ లు, చిన్న, మధ్య తరహా, సూక్ష్మ, పెద్ద పరిశ్రమలు ఇప్పుడు రక్షణ వ్యవస్థలో పెట్టుడులు పెడుతున్నాయని అన్నారు. మరోవైపు ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ కొన్ని ఎయిర్ నష్టాలను చవి చూసిందన్నారు. అయితే భారత్ కి చెందిన ఆరు ఫైటర్ జట్స్ ని కూల్చేశామనే పాక్ వాదనల్ని మాత్రం ఆయన తిరస్కరించారు. అది పూర్తిగా తప్పని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *