దాల్ సరస్సు వ్యర్థాల నుండి సేంద్రీయ ఎరువుల తయారీ.. రైతులకు గొప్ప లాభం

సేంద్రీయ  ఎరువుల తయారీ విషయంలో కొత్త ప్రయోగం చేయబోతున్నారు. శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సులో  వుండే కలుపు మొక్కల ద్వారా సేంద్రీయ ఎరువు తయారు చేసేందుకు  రెడీ అవుతున్నారు. లైక్‌ కన్జర్వేటివ్‌ అండే మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు క్లీన్‌ ఎఫెంటెక్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మరియు నేషనల్‌ అగ్రికల్చర్‌ కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయయి. ఈ ప్రాజెక్టు విలువ సఱమారు 30,500 కోట్లు. ఇప్పటికే దీనిని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్లాంట్‌ ద్వారా 70 వేల టన్నుల సరస్సు  వ్యర్థాలను, ముఖ్యంగా కలుపు మొక్కలను తీయనున్నారు. వీటి ద్వారా యేటా 24,000 టన్నుల సేంద్రీయ ఎరువు, అనుబంధ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇలా సేంద్రీయ ఎరువుగా మార్చడం వల్ల జమ్మూ కశ్మీర్‌ లోయలోని వ్యవసాయ  రంగానికి భారీగా ప్రయోజనం చేకూరుతుందని అధికారులు తెలిపారు. సరస్సులో  వుండే వ్యర్థాలను అధిక నాణ్యత గత సేంద్రీయ ఎరువులుగా మారుస్తున్నామని , ఉద్యోగాలను కూడా కల్పిస్తున్నామని  అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా దాల్‌ సరస్సు  అందాన్ని కూడా మరింత పెంచుతున్నామని అన్నారు.

ఇలా వ్యర్థాల నుంచి తయారు చేససన సేంద్రీయ ఎరువు కశ్మీర్‌ రైతులకు సులభంగా  అందుబాటులోకి తేనున్నారు అధికారులు. అక్కడి రైతుల వ్యవసవయ దిగుబడిని ఈ సేంద్రీయ ఎరువులు పెంచుతాయని, సేంద్రీయ వ్యవసవయ పద్ధతులను ఇలా ప్రోత్సహిస్తున్నామని  అధికారులు పేర్కొన్నారు.

నిజానికి ఈ ప్రాంత రైతులు సేంద్రీయ ఎరువుల కోసం బాగా ఖర్చులు చేసఱ్తన్నారు. యూపీ, హర్యానా నుంచి ఈ సేంద్రీయ ఎరువులను కొనుగోలు చేసఱ్తంటారు. దీంతో రవాణా ఖర్చులతో పాటు ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు సరస్సు  వ్యర్థాల నుంచి తయారు చేస్తున్న  సేంద్రీయ ఎరువుల ద్వారా రైతులకు బాగా లాభం చేకూరనుంది. అతి తక్కువ ధరకు సేంద్రీయ ఎరువులు లభించనుంది.

మరో వైపు ప్రతి యేడాది దాల్‌ సరస్సు  వేలాది టన్నుల వ్యర్థాలు పర్యావరణాన్ని కలుషషతం చేస్తున్నాయి.  ఈ కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి కూడా ఈ ప్రాజెక్టు చేపట్టారు.సేంద్రీయ  ఎరువును ఉత్పత్తి చేయడం ద్వారా వ్యర్థాల నిర్వహణకు ఓ మార్గం వేయడంతో పాటు రైతులకు సేంద్రీయ ఎరువులను అందుబాటులోకి తెచ్చినట్లు కూడా అవుతుంది. ఇక… ఈ ప్రక్రియ ద్వారా పర్యావరణ ఇబ్బందులు కూడా రాకుండా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసఱకుంటున్నారు. జీవ వైవిధ్యానికి ఎలాంటి భంగం కలగకుండా పూర్తి శాస్త్రీయ  పద్ధతులు అవలంబిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *