‘‘జనగణన’’ చిహ్నాలు ఆవిష్కరణ.. స్త్రీ, పురుష జగ గణకులు ప్రతిబింబించేలా చిహ్నాలు

కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 2027 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగంగా హోంమంత్రి అమిత్ షా ప్రగతి, వికాస్ పేరుతో రెండు జనగణన చిహ్నాలను ఆవిష్కరించారు. స్త్రీ, పురుష జనగణకులను ప్రతిబింబించేలా వీటిని రూపొందించారు. స్త్రీ,పురుష జనగణకులను ప్రతిబింబించేలా ఈ చిహ్నాలను రూపకల్పన చేశారు.2047నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంలో మహిళలు,పురుషులు సమానంగా భాగస్వామ్యం కావాలనే సందేశాన్ని ఈ చిహ్నాలు తెలియజేస్తాయని అధికారులు పేర్కొన్నారు.

జనగణన-2027కు సంబంధించిన ముఖ్యమైన లక్ష్యాలు,సమాచారాన్ని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరవేయడంలో ఈ చిహ్నాలు ఉపయోగపడతాయని అధికారిక ప్రకటనలో తెలిపారు. అలాగే 2027 జనాభా లెక్కలసేకరణకు సంబంధించిన వివరాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ప్రచారం చేయడానికి కూడా వీటిని వినియోగించనున్నారు.

తొలిసారి డిజిటల్ రూపంలో సేకరించనున్న లెక్కల కోసం సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ రూపొందించిన డిజిటల్ సాధనాలను కూడా అమిత్ షా ఈ సందర్భంగా విడుదల చేశారు. ఉపగ్రహఫొటోల సాయంతో డిజిటల్ మ్యాపింగ్ కు సహాయపడే హౌస్ లిస్టింగ్ బ్లాక్ క్రియేటర్ తో పాటు గృహ జాబితా సమాచారాన్ని సేకరించి అప్ లోడ్ చేసేందుకు ఉపయోగపడే ఆఫ్ లైన్ మొబైల్ యాప్ హెచ్ఎల్ ఓ ను కూడా అమిత్ షా ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *