ఎరువుల తయారీ కంపెనీలకు 37,952 కోట్ల పోషకాహార సబ్సిడీ : కేంద్ర కేబినెట్

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఎరువుల తయారీ కంపెనీలకు రూ. 37,952 కోట్ల పోషకాధారిత సబ్సిడీ (Nutrient-Based Subsidy – NBS) మంజూరు చేయాలని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

ఇందుకోసం రూ.37,952.29 కోట్లు కేటాయించింది. నైట్రోజన్‌పై కిలోకు రూ.43.02, ఫాస్పర్ట్‌ పై కిలోకు రూ. 47.96, పొటాష్‌ పై కిలోకు రూ. 2.38, సల్ఫర్‌ పై కిలోకు రూ 2.87 రాయితీ వర్తింపజేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. డై అల్యూమినియం ఫాస్పేట్‌ (డీఏపీ), మోనో అల్యూమినియం ఫాస్పేట్‌ (ఎంఎపి), మ్యూరియేట్‌ ఆఫ్‌ పొటాష్‌ (ఎంఓపీ), ట్రిపుల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ (టిఎస్‌ పి), 3 గ్రేడ్స్‌ ఆఫ్‌ సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ (ఎస్‌ఎస్‌ పి), పొటాష్‌ డెరైవ్‌డ్‌ మొలాసెస్‌ (పిడిఎం), అల్యూమినియం సల్ఫేట్‌ (ఎఎస్‌) వంటి దాదాపు 28 ఎన్‌పికెఎస్‌ కాంప్లెక్స్‌ ఫర్టిలైజర్స్‌ను ఉత్పత్తి చేసే కంపెనీలకు పోషకాధిరత రాయితీ అమలు చేయాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయంతో పెరుగుతున్న ఎరువుల ధరల భారం రైతులపై పడకుండా ప్రభుత్వం మోస్తుంది. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా ఎరువుల ధరలు బాగా పెరిగినప్పటికీ, భారత రైతులు ఆ ప్రభావం ఎదుర్కోకుండా మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైతులు ఇబ్బందిపడకుండా ఉండేందుకు తయారీదారులకే సబ్సిడీ చెల్లించే విధానాన్ని కొనసాగిస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *