లాక్ డౌన్ విధింపు వార్తలన్నీ అవాస్తవమే : కేంద్రం క్లారిటీ
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో మన దేశంలో ఏర్పడిన పరిస్థితులు ,ఇంధన కొరత నేపథ్యంలో లాక్ డౌన్ విధిస్తారన్న వార్తలపై కేంద్రం స్పందించింది. లాక్ డౌన్ పై వినిపిస్తున్న ఊహాగానాలన్నీ అవాస్తవమేనని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తేల్చి చెప్పారు.
అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని, ఎనర్జీ, సరఫరా గొలుసు, అత్యవసర సరుకు రవాణా వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దేశంలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు.
లాక్ డౌన్ పై వినిపిస్తున్న ఊహాగానాలు పూర్తిగా అవాస్తవమని, అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదన్నారు. ఇలాంటి వదంతులు సమాజానికి హాని చేస్తాయని, గందరగోళం సృష్టిస్తాయని అన్నారు. ఈ సమయంలో అందరూ బాధ్యతతతో మెలగాలని పిలుపునిచ్చారు.