దేశంలో ఇంధన ధరలు పెరగవ్ : కేంద్రం క్లారిటీ
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయంటూ వస్తున్న వార్తలపై భారత ప్రభుత్వం స్పందించింది.కూడ్రాయిల్ ధరలు పెరిగినా.. దేశంలో ఇంధన ధరలు పెరగవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నష్టాలను ఆయిల్ కంపెనీలు భరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. సామాన్య ప్రజలకు, వాహనదారులకు పెద్ద ఊరటనిచ్చింది.
ప్రస్తుతం.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటుతున్న నేపథ్యంలో భారత్‌లో ఇంధన ధరలపై భారం పడకుండా చూడాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. నష్టాలను తాత్కాలికంగా భరించాలని కేంద్రం ఆదేశించింది. దేశంలో ఇప్పటికే ముడి చమురు నిల్వలు 25 రోజులకు, రిఫైన్డ్ ఇంధనాలు మరో 25 రోజులకు సరిపడా ఉన్నాయని పేర్కొంది. మొత్తంగా 8 వారాల ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయంది. ఇక.. రష్యా, ఇతర దేశాల నుంచి దిగుమతులు కొనసాగుతున్న నేథ్యంలో సరఫరా స్థిరంగా ఉంది.