రిజిస్టర్డ్ పోస్ట్ ను నిలిపేయడం అనేవి తప్పుడు వార్తలు : కేంద్రం క్లారిటీ
తపాలా శాఖకి సంబంధించిన రిజిస్టర్డు పోస్ట్ ను నిలిపేస్తున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్డు పోస్ట్ ను నిలిపేస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవమని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ప్రజలను సందిగ్ధంలోకి నెట్టేస్తున్నారని మండిపడింి. రిజిస్టర్డు పోస్ట్ సేవలు నిలిపివేయడం లేదని, ఇది స్పీడ్ పోస్టులో విలీనం అవుతోందని స్పష్టం చేసింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం మాధ్యమంగా ప్రకటించింది. గతంలో మాదిరిగానే రిజిస్టర్డు పోస్ట్ ను సంబంధిత వ్యక్తులు నేరుగా వచ్చి డెలివరీ చేస్తారని, డెలివరీ రసీదు, రియల్ టైమ్ ట్రాకింగ్ వుంటుందని పేర్కొంది.