వాతావరణం అప్ డేట్ అంతా రైతుల చేతిలోనే… ఎప్పుడు వర్షం పడుతుందో ఈ యాప్ చెప్పేస్తుంది

వాతావరణ మార్పులు ఇప్పుడు ప్రపంచాన్నే అతాలకుతలం చేస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్‌లో మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కాలం మారుతోంది కాబట్టి ఎప్పుడు వర్షం పడుతుందో, ఉరుములు వస్తాయో తెలియక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు రైతులకు, ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలోనే దీని పని ఎక్కువగా వుంటుంది. మెరుపులు, ఉరుముల నుంచి రక్షించుకోవడం, వర్షం ఎప్పుడు భారీగా వర్షం కురుస్తుందో తెలుసుకోవచ్చు. దీనిని భారత భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ రూపొందించింది. ఈ యాప్‌లు రైతులకు బాగా ఉపయోగకారి. ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో ప్లేస్టోర్‌లోకి వెళ్లి, యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు.. వాతావరణం తెలిసిపోతుంది.

మెరుపు హెచ్చరికల కోసం ‘డామిని’’
మెరుపు హెచ్చరికల కోసం ఇది ఉపయోగపడుతుంది. మెరుపు ఎందుకు వస్తుంది, మెరుపు వచ్చినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ యాప్‌లో వివరించారు. లొకేషన్‌ ఆధారంగా ఎక్కడెక్కడ మెరుపులు వచ్చే అవకాశముందో సూచిస్తుంది. పిడుగు పడినపుడు తోటివారికి అందించాల్ని వైద్య సహాయం, శ్వాస ఆగిపోతే నోటి నుంచి శ్వాసను అందించడం, గుండె చప్పుడు ఆగిపోతే సీపీఆర్‌ చేయడం తదితర వివరాలతో పాటు చేయాల్సిన పనులను ఇందులో వుంటుంది.

వర్ష సూచనల కోసం ఎయిర్‌ ఈ అలార్మ్‌…
ఎప్పటికప్పుడు వర్ష సూచనను ఈ యాప్‌ తెలియజేస్తుంది. మనం వున్న ప్రాంతంతో పాటు ఎక్కడెక్కడ వర్షం పడుతుందో ఇది చూపిస్తుంది. ఏ స్థాయిలో వర్షం కురుస్తుందో కూడా తెలియజేస్తుంది. ఉష్ణోగ్రత ఎంత వుంటుంది? మేఘావృతం లాంటి అంశాలను కూడా తెలియజేస్తుంది.

పూర్తి వివరాలతో ‘‘మేఘదూత్‌’’
ఈ యాప్‌లో ఇక సమగ్ర సమాచారం వుంటుంది. వర్షపాతం, గాలిలో తేమ, వేగం, గాలి ఏ దిక్కు నుంచి వస్తుంది? ఉష్ణోగ్రత తదితర అంశాలను ఈ యాప్‌ లో అప్‌డేట్‌ అవుతూ వుంటుంది. వాతావరణం ఎలా వుంటుందో వారం రోజుల ముందే ఇందులో తెలిసిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *