పీఎం – కిసాన్ సమ్మాన్ నిధులు పొందాలంటే ఇ – కేవైసీ పూర్తి చేయాలి : కేంద్రం
పీఎం – కిసాన్ సమ్మాన్ నిధులు పొందాలంటే ఇ – కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. మార్చి 13 వ తేదీన 22 వ విడత నిధుల విడుల నేపథ్యంలో కేంద్రం రైతులకు ఈ సూచనలు చేసింది. అర్హులైన రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. ‘‘పీఎం కిసాన్ పోర్టల్’’ లో ఇ-కేవైసీ ఎంపిక చేసుకొని ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి వుంటుంది. ఓటీపీ లేదా బయోమెట్రిక్ ప్రక్రియ ద్వారా దీన్ని పూర్తి చేయవచ్చు. ఈ రెండూ కాకుండా ఫేస్ అథంటికేషన్ మొబైల్ యాప్ ను కూడా కేంద్రం తీసుకొచ్చింది.