‘‘శక్తియుత గ్రామం’’ పేరుతో సరిహద్దు గ్రామాలకి జీవం పోస్తున్న కేంద్రం
సరిహద్దు గ్రామాల్లో అభివృద్ధి చేయడం ద్వారా వ్యూహాత్మకంగా రక్షణ రంగం విషయంలో శత్రువులను అడ్డుకట్ట వేయవచ్చని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనికి ‘‘శక్తియుత గ్రామం’’ అని పేరు పెట్టింది. దీనికింద 2022-2023 నుంచి 2025-2026 వరకూ 4,800 కోట్ల మేరకు కేంద్రం నుంచి సాయం అందుతుంది. అలాగే సరిహద్దు గ్రామాల్లోని రహదారుల అనుసంధానం కోసం మరో 2,500 కోట్లు కేటాయించింది. సరిహద్దు గ్రామాలలో మహిళా, యువతరం సాధికారతతో సహా అన్ని రకాల వాతావరణ సంధానం, రక్షిత సాగునీరు, సౌర పవన శక్తి ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా, మొబైల్ ఇంటర్నెట్ సంధానం, బహుళ ప్రయోజన కేంద్రాలు, ఆరోగ్య శ్రేయో కేంద్రాల ఏర్పాటుతో పాటు పర్యాటక రంగంపై దృష్టి సారిస్తారు.
ఈ కార్యక్రమం కింద కేంద్రం సహకార సంఘాలను ఏర్పాటు చేస్తుంది. ఆయా గ్రామాల్లో వ్యవస్థాపన, వ్యవసాయం, తోటల పెంపకం, ఔషద మూళికల పెంపకంతో సహా వివిధ జీవనోపాధి అవకాశాల నిర్వహణతో పాటు నిరంతర పర్యవేక్షణ కూడా అధికారులకు అప్పగించింది. ఇందులో భాగంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్ పరిధిలో ఉత్తర సరిహద్దును ఆనుకొని వున్న 19 జిల్లాలోని 2,967 గ్రామాలను ఈ పథకం కింద అభివృద్ధి చేస్తున్నారు.
ఉత్తర సరిహద్దులోని అన్ని గ్రామాల నుంచి వలసల నిరోధం, పర్యాటకానికి ప్రోత్సాహం, వివిపి ద్వారా నగర స్థాయి సదుపాయాల కల్పన వంటి లక్ష్యాలతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కేంద్ర, రాష్ట్ర, జిల్లా సమితి స్థాయిలలో వివిపి కింద పంచాయతలు గ్రామ సభల భాగస్వామ్యం బాధ్యతలను కూడా పాలనపరంగా చూసుకుంటారు. ఈశాన్య భారతాన్ని 2014 కి ముందు సమస్యాత్మక ప్రాంతంగా పిలిచేవారు. కానీ కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చిన తర్వాత లుక్ ఈస్ట్ పాలసీతో ఆ ప్రాంతం సమస్యాత్మక స్థాయి నుంచి నేడు ప్రగతికి, సౌభాగ్యానికి ప్రతీకగా గుర్తింపు పొందుతోంది.
సరిహద్దు రహదారుల సంస్థ 1960 లో తూర్పున ప్రాజెక్ట్ టస్కర్, ఉత్తరాన ప్రాజెక్ట్ బీకన్ కేవలం రెండు ప్రాజెక్టులతో ప్రారంభమైంది. నేడు 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో 18 ప్రాజెక్టులతో ఓ శక్తిమంతమైన సంస్థగా రూపొందింది. దేశమంటే సరిహద్దుల నుంచే ప్రారంభమవుతుంది. అందుకే సరిహద్దులలో మౌలిక సదుపాయాల కల్పనకు వేగిరం చేసింది. శక్తియుత గ్రామం కింద ఆ గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేస్తున్నారం.