రైతులకు గుడ్‌ న్యూస్‌.. 14 పంటల కనీస మద్దతు ధరను పెంచిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 2024`2025 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌కి సంబంధించి 14 పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వరి, గోధుమ, పత్తి సహా 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ప్రకటించారు. ఆయా పంటల ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం జోడిరచే ఈ ధరలను నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. వరికి కనీస మద్దతు ధర రూ. 117 అదనంగా పెంచడంతో క్వింటాల్‌ ధాన్యం ధర 2,300కి చేరుకుంది. అంటే ధర 5.35 శాతం పెరిగినట్లు లెక్క. 2013`14 మద్దతు ధరతో పోల్చితే 1,310 రూపాయలు ఎక్కువ.

 

ఇక మధ్య రకం పత్తికి 7,121, లాంగ్‌ స్టెపెల్‌ రకానికి 7,521 రూపాయలకు పెంచారు. గత మద్దతు ధరతో పోలిస్తే ఇది 510 రూపాయలు ఎక్కువ. జొన్న (హైబ్రిడ్‌) రూ 3,371, జొన్న (మాల్దండి) 3,421, సజ్జలు 2,625, రాగులు 4,290, మక్కజొన్న మద్దతు ధరను 2,225 రూపాయలకు పెంచారు. ఇక పప్పు ధాన్యాల విషయానికి వస్తే పెసర్లు 8,682, కంది 7,550 రూపాయలు, మినుములకు మద్దతు ధరను 7,400 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. నూనె గింజలకు సంబంధించి వేరుశెనగ 6,783, పొద్దు తిరుగుడు విత్తనాలు 7280, నువ్వులు 9,267, సోయాబీన్‌ 4,892 రూపాయలుగా ఖరారు చేశారు. మద్దతు ధర పెంపుతో గతేడాదితో పోలిస్తే రైతులకు 35,000 కోట్ల లాభం చేకూరింది.

2024`25 ఖరీఫ్‌ సీజన్‌కి పంటల కనీస మద్దతు ధరలు ఇలా (క్వింటాల్‌ రూపాయల్లో)

వరి సాధారణం 2023`24 లో 2,183, 2024`2025 లో 2,300 రూపాయలు.. అంటే 117 రూపాయల పెంపు అయినట్లు లెక్క.
2. వరి ఏ గ్రేడ్‌ 2023`24 లో 2,203` 2024`2025 లో 2,203 అంటే 117 పెంపు
3. జొన్న హైబ్రీడ్‌ 3,180 `2024`2025 లో 3,371 అంటే 191 రూపాయల పెంపు
4. జొన్న మాల్దండి 2023`2024 లో 3,335 వుంటే.. 2024`2025 లో 3,421 అంటే 196 రూపాయల పెంపు
5. సజ్జ 2023`2024 లో 2,500, 2024`2025 లో 2,625 అంటే 125 రూపాయల పెంపు
6. రాగి 2023`2024 లో 3,846, 2024`2025 లో 4,290 అంటే 444 రూపాయల పెంపు.
7. మొక్కజొన్న 2023`2024 లో 2,090, 2024`2025 లో 2,225 అంటే… 135 రూపాయల పెంపు.
8. కంది 2023`24 లో 7,000, 2024`25 లో 7,550 అంటే 550 రూపాయల పెంపు
9. పెసర 2023`24 లో 8,558, 2024`25 లో 8,682 అంటే 124 రూపాయల పెంపు
10. మినుములు 2023`24 లో 6,950, 2024`25 లో 7,400 అంటే 450 రూపాయల పెంపు.
11. వేరుశెనగ 2023`24లో 6,377, 2024`2025 లో 6,783 అంటే 406 రూపాయల పెంపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *