సోమన్ వాంగ్ చుక్ కి షాక్.. ఎన్జీవో FCRA లైసెన్స్ రద్దు

లద్దాఖ్ ఆందోళనకు కుట్రలు పన్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సోమన్ వాంగ్ చుక్ కి సంబంధించిన ఎన్జీవో విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ నిధులకు సంబంధించిన చట్టాలను పదే పదే ఉల్లంఘించదని ఆయనకు సంబంధించిన ఎన్జీవో హిమాలయన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ లర్నింగ్ (HAIL) లైసెన్స్ ను కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. విదేశీ రుణాలకు సంబంధించిన నిబంధనలను ఈ సంస్థ పదే పదే ఉల్లంఘించిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని హోంశాఖ స్పష్టంగా పేర్కొంది.
వాంగ్ చుక్ నేతృత్వంలో లద్దాఖ్ లో రాష్ట్ర హోదా కోసం కొంత కాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కానీ.. బుధవారం ఇవి హింసాత్మకంగా మారిపోయింది. నలుగురు మరణించారు. ఈ పరిస్థితికి వాంగ్ చుక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని హోంశాఖ పేర్కొంది. దీని తర్వాతే ఆయనకు సంబంధించిన ఎన్జీవోపై కేంద్రం చర్యలు తీసుకుంది. ఆ ఎన్జీవోలో విదేశీ నిధుల నియంత్రణ చట్టం నిబంధనలను ఉల్లంఘన వంటి కారణాలతో లైసెన్స్ రద్దైంది.
కేంద్ర హోంశాఖ అధికారుల ప్రకారం సీబీఐ గత రెండు నెలలుగా HIAL సంస్థకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తూనే వుంది. అయితే ఇంకా ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు కాలేదు.అయితే.. వాంగ్ చుక్ కి సంబంధించిన ఎన్జీవోపై వస్తున్న ఆరోపణలు కొత్తేమీ కాదు. ఆగస్టు మాసంలోనూ వచ్చాయి. తన ఎన్జీవోకి సంబంధించిన భూ కేటాయింపును ప్రభుత్వం రద్దు చేసింది. ఏ కారణంగానైతే భూ కేటాయింపులు కావాలని అడిగారో.. దాని కోసం వాంగ్ చుక్ వినియోగించలేదని, అలాగే అధికారిక లీజు మద్దతు విషయంలోనూ సరిగ్గా లేరని ప్రభుత్వం రద్దు చేసింది.
అపెక్స్ బాడీ లేహ్ మరియు కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ రెండింటితోనూ కేంద్రం టచ్ లోనే వుందని, అలాగే హై పవర్ కమిటీతోనూ టచ్ లోనే వుందని అయినా, వాంగ్ చుక్ రెచ్చగొడుతున్నారని హోంశాఖ తెలిపింది. అలాగే కొన్ని హామీలను కూడా ఇచ్చామని, అయినా వాంగ్ చుక్ తిరుగుబాటు దార్లను, నిరసనలను ప్రోత్సహిస్తున్నారని, యువతను రెచ్చగొడుతున్నారని ప్రభుత్వం మండిపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *