ఇక నుండి జూన్ 25 వ తేదీని ‘‘రాజ్యాంగ హత్య దినం’’ గా పాటిస్తాం : కేంద్రం ప్రకటన
కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కాంగ్రెస్ పాలనలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25 వ తేదీని ‘‘రాజ్యాంగ హత్య దినం’’ గా ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం ఓ గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఇక నుంచి జూన్ 25 వ తేదీని ‘‘సంవిధాన్ హత్యా దివస్’’ గా పాటిస్తామని ప్రకటించారు. 1975 జూన్ 25 న అప్పటి ప్రధాని ఇందిరా తన నియంతృత్వ పాలనతో దేశంలో ఎమర్జెన్సీ విధించి, ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు. ఎలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైలులో పెట్టారు. మీడియాను ఒత్తేశారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్ 25 ను ‘‘సంవిధాన్ హత్య దివస్’’ గా నిర్వహించాలని నిర్ణయించాం’’ అని అమిత్ షా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.