చంద్రయాన్ -5 మిషన్ కి కేంద్రం ఆమోదం
చంద్రునిపై పరిశోధనలకు సంబంధించిన చంద్రయాన్-5 మిషన్ కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ప్రకటించారు. చంద్రయాన్- 5 మిషన్‌కు మూడు రోజుల క్రితమే ఆమోదం లభించిందని చెప్పారు. చంద్రయాన్-2లో 25 కిలోల బరువు ఉన్న రోవర్ ‘ప్రజ్ఞాన్’ను చంద్రుడిపై తీసుకెళ్లగా, చంద్రయాన్-5లో 250 కిలోల రోవర్‌ను తీసుకెళ్తామని తెలిపారు. 2027లో చంద్రయాన్-4 మిషన్‌ను ప్రయోగించునున్నారు. చంద్రుడిపై ఉన్న మట్టి నమూనాలను తీసుకురావడం ఆ మిషన్ ప్రధాన లక్ష్యం. చంద్రయాన్-5ను జపాన్ సాయంతో నిర్వహిస్తామని నారాయణన్ తెలిపారు.చంద్రుడి నమూనాలు తీసుకొని వచ్చేందుకు 2027లో చంద్రయాన్-4ను ప్రయోగించనున్నట్టు వెల్లడించారు.