జమ్మూ కాశ్మీర్ ఎల్జీకి మరిన్ని అధికారాలు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం
జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్జీకి మరిన్ని అధికారాలను కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. పోలీసులు, ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు, పోస్టింగ్స్‌తో పాటు అడ్వకేట్ జనరల్, లా ఆఫీసర్లను నియమించే అధికారం కూడా ఇక నుంచి ఎల్జీకే అప్పగించింది. ఇందుకోసం జమ్మూ కశ్మీర్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2019 లో సవరణ చేసింది. ఈ సవరణలకు రాష్ట్రపతి కూడా ఆమోద ము వేయడంతో కేంద్రం ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇంతకు పూర్వం పోలీస్, శాంతిభద్రతలు, ఆలిండియా సర్వీసులు, ఏసీబీ వ్యవహారాలకు ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేకుండా వుండేదని, ఈ వ్యవహారాలపై సీఎస్ ఫైల్స్‌ను ఎల్జీకి పంపించాలని పేర్కొంది.
ఇకపై అడ్వొకేట్ జనరల్, న్యాయ అధికారులను కూడా ఎల్జీయే నియమిస్తారని అందులో స్పష్టం చేసింది. ఈ నూతన అధికారాల ప్రకారం కశ్మీర్‌లో అడ్వకేట్ జనరల్‌తో పాటు న్యాయాధికారుల నియామకాలను కూడా ఎల్జీయే చేపడతారు. అలాగే ఏసీబీ , వ్యవహారాలను కూడా ఆయనే చూస్టారు . అడ్వకేట్ జనరల్, న్యాయాధికారుల నియామకాలకు ససబంధించిన న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు పంపే ప్రతిపాదనలను ఇక నుంచి సీఎస్, సీఎం ద్వారా ఎల్జీకి పంపాలి. వీటితో పాటు ప్రాసిక్యూట్ అనుమతి, అప్పీల్ దాఖలు ప్రతిపాదనలను సీఎస్ ద్వారా ఎల్జీకి పంపాలి.