రామ నవమి సందర్భంగా అయోధ్య రామ మందిర్ మూడు రోజులు 24 గంటలూ తెరిచే ఉంచుతాం
శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య రామమందిరాన్ని ఏప్రిల్ 16,17,18 తేదీ 24 గంటలూ తెరిచే వుంచుతామని అయోధ్య రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకటించారు. శ్రీరామ నవమి రోజు ఆలయంలో జరిగే పూజాది కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని, ఇందు కోసం ఇప్పటికే ప్రసార భారతి కూడా అంగీకరించిందని తెలిపారు. శ్రీరామ నవమి రోజు అయోధ్య నగరంలో 100 చోట్ల ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు ఎండబారిన పడకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, శ్రీరామ నవమికి వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో వుంటుందని ప్రకటించారు. భక్తులెవ్వరూ ఆలయంలోకి ఫోన్లు తీసుకురావద్దని చంపత్ రాయ్ సూచించారు.