చంద్రయాన్‌ -3 విజయంలో మణిపూర్‌ శాస్త్రవేత్తలు

చంద్రయాన్‌ మిషన్‌ విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల బృందంలో ఉన్న ఇద్దరు మణిపూర్‌ శాస్త్రవేత్తల కృషికి ఆ రాష్ట్రం ఎంతో గర్వపడుతోంది. మణిపూర్‌లోని బిష్ణుపూర్‌ జిల్లా తంగాకు చెందిన డాక్టర్‌ రఘు నింగ్‌థౌజం చంద్రయాన్‌-3 విజయంలో ఎంతగానో కృషిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలలో ఒకరు. డాక్టర్‌ రఘు ఇండియన్‌ ఇన్‌స్టిట్టూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (IISc) బెంగళూరు, IIT-గౌహతి, ఇంఫాల్‌లో DM కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు.  ఈ మిషన్‌ వెనుక మణిపూర్‌ మూలానికి చెందిన మరో శాస్త్రవేత్త, అస్సాంలోని సిల్చార్‌కు చెందిన వై బిషల్‌ సింఘా కూడా రాష్ట్రం గర్వపడేలా చేశారు. వై.బిషల్‌ సింఘా IIT గౌహతిలో విద్యాభ్యాసం తర్వాత ISROలో థర్మల్‌ సిస్టమ్స్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ సందర్భంగా మణిపూర్‌ ముఖ్య మంత్రి ఎన్‌ బీరెన్‌ సింగ్‌ ట్విట్టర్‌ ద్వారా తన అభినందనలను వ్యక్తం చేశారు. ‘‘మణిపూర్‌ బిష్ణుపూర్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ రఘు నింగ్‌థౌజం చంద్రయాన్‌ -3 ల్యాండిరగ్‌ మిషన్‌లో భాగస్వామ్యవడం సంతోషకరమైన విషయం. అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్యలు మన 2వేల ఏళ్ల చరిత్రను తుడిచి వేయలేవు. సమస్యలతో సంబంధం లేకుండా, మణిపూర్‌ ప్రజలు ఎల్లప్పుడూ బలంగా పుంజుకుంటారు.  అని సిఎం బిరెన్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *