భారతీయ సంతతికి చెందిన ఆవుల విశేషాలు

అత్యంత ప్రాచీన కాలం నుంచి భారత్‌ లో ఆవు, మానవులకు ఒక సహచరునిగా, ఇంట్లో పెంచి పోషించుకునే జంతువుగా వుంటూ వస్తోంది. భారతీయుల ఆవు శాకాహారి. మూపురము, గంగడోలు భారతీయ గోసంతతి విశేషత. భారతీయ సంతతి ఆవులు ఆప్గన్‌, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తాయి. గోవధ నిషేధాన్ని మన ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయని కారణంగా 70 భారతీయ తెగల్లో నేటికి 32 మాత్రమే మిగిలి వున్నాయి. పట్టణాలలో పశుగ్రాసపు కొరత, ఆవులు తిరిగే స్థానం లేకుండా పోవడం వల్ల ఆవులకు పట్టణాల్లో స్థానం లేకుండా పోయింది. గ్రామాల్లోనూ అదే పరిస్థితి.

దేశీయ ఆవుల లక్షణాలు :
1. నడుముపై మూపురము, మెడ కింద గంగడోలు స్వదేశీ ఆవుల విశేషతలు. మూపురంలో సూర్యనాడి వుంటుంది. ఫలితంగా పాలు పసుపు పచ్చగా బంగారం రంగులో వుంటాయి.
2. సాధారణంగా కొమ్ములు పొడుగ్గా వుంటాయి. శరీరం సాధారణంగానే వుంటుంది.
3. దేశీయ గోసంతానమైన ఎద్దులు బాగా శ్రమిస్తాయి. వ్యవసాయంలో విరివిగా ఉపయోగపడతాయి.
4. ఈ ఆవు ఉచ్చస్వరంతో అరుస్తుంది.
5. ఆవు చాలా చలాకీగా, చురుగ్గా వుంటుంది.
6. ఈ ఆవులు తన యజమానికే పాలిస్తాయి. కొత్తవారికి ఈయవు. వందల ఆవుల మధ్య కూడాదూడ తన తల్లిని గుర్తిస్తుంది. ఆవు ఎంత దూరంలో వున్నా, తన ఇంటికి కూడా గుర్తుపడుతుంది.

దేశీయ ఆవుల వల్ల కలిగే ప్రయోజనాలు :
1. దేశీయ సంతతికి చెందిన ఆవు పాల్ల బుద్ధి సునిశితమవుతుంది. అన్ని పౌష్టిక పదార్థాలను కలిగి వుంటుంది. విషకరమైన వాటిని నిరోధించి, శక్తిని కలిగిస్తుంది. ఇది సర్వోత్తమమైంది. తల్లి పాల లాగా సులభంగా జీర్ణమవుతుంది. తల్లి పాలలో వుండే అన్ని సుగుణాలు దేశీయ సంతతి ఆవు పాలలో లభ్యమవుతాయి.
2. పాలను ఎక్కువ పరిమాణంలో ఇవ్వదు. అయితే 12 నుంచి 13 సంవత్సరాల పాటు వరుసగా ఇస్తుంది.
3. దేశీయ సంతతికి చెందిన ఆవు కార్బన్‌డైయాక్సైడ్‌ను శ్వాసగా తీసుకొని ఆక్సిజన్‌ను శ్వాసగా వదులుతుంది.
4. దేశీయ ఆవు నెయ్యి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బుద్ధి సునిశితం చేస్తుంది. విషపదార్థాల నుండి రక్షించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పాలలో అనేక ఔషధ గుణాలున్నాయి.
5. దేశీయ ఆవు చర్మానికి విషగుణాలను హరించే లక్షణం కూడా వుంది. తోక ద్వారా చర్మాన్ని శుభ్రంగా ఎప్పుడూ వుంచుకుంటుంది. ఆవు శరీరాన్ని నిమిరే వారికి కూడా ఆరోగ్యం మెరుగవుతుంది.
6. దేశీయ ఆవు పాల వల్ల లభించే మజ్జిగతో చలవ. పైత్యాశయం, ప్రేగులను శుభ్రం చేస్తుంది. బుద్ధికి బలం.
7. స్వదేశీ ఆవులలో బీటా కాసో మార్లెన్‌ అనే విషకణం వుండదు.
8. ఆవు పాలు, పెరుగు, నెయ్యి మూత్రం, పేడ వైద్య పరంగా కూడా పనికోస్తుంది.
9. ఆవు మరణానంతరం కొమ్ములు ఇతర శరీర భాగాలు భూమిలో, పొలంలో పాతిపెడితే ఆరు నెలల తరువాత ఎరువుగా పనికొస్తుంది.

దేశీయ ఆవు పాల విశేషాలు :
1. ఈ ఆవు పాల వల్ల లభించే నెయ్యి ఒక తులాన్ని మండిస్తే ఒక టన్ను ఆక్సిజన్‌ విడుదల అవుతుంది.
2. ఆవు పాలల్లో కైరోటిన్‌ అనే పదార్థం వుంటుంది. దీని వల్ల నేత్ర వ్యాధులు నయం అవుతాయి. ఇది విటమిన్‌ ఏకి పర్యాయం.
3. ఆవు పాల వలె నెయ్యి, పెరుగు కూడా ఔషధ గుణాలు కలిగి వున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *