ఈ నెల 10 నుండి చార్ధామ్ యాత్ర ప్రారంభం… ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం
హిందువులకు అత్యంత పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్ర ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుంది. యాత్రలో భాగంగా కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిని భక్తులు సందర్శించుకుంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు పర్యాటక శాఖ ప్రకటించింది. ఇక… హరిద్వార్, రిషికేశ్‌లో బుధవారం నుంచి ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. అలాగే ధర్మనగరిలోని పర్యాటక శాఖ కార్యాలయ ఆవరణలోనూ ఆరు కౌంటర్లను ఏర్పాటు చేశారు. చార్ధామ్ యాత్రికుల కోసం 500 స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. మరోవైపు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల సౌకర్యం కూడా వుంది. చాలా మంది ఇప్పటికే ఈ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. రోష్నాబాద్‌లోని ఆర్టీవో కార్యాలయ ఆవరణ నుంచి చార్ధామ్ యాత్రికులు వచ్చే వాహనాలకు గ్రీన్‌కార్డులు ఇవ్వనున్నారు. డ్రైవర్లు సులభంగా ఈ కార్డులు పొందవచ్చు.