అఫ్జల్ ఖాన్‌ని చీల్చిన శివాజీ మహారాజ్ పులిగోళ్ళు ఇక భారత్‌లోనే…
అత్యంత క్రూరుడైన మొఘల్ సైన్యాధికారి అఫ్జల్ ఖాన్‌ని చంపడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించిన పులిగోళ్లు లండన్ నుంచి వచ్చి ఇక మన దేశంలోనే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల ద్వారా ఈ పులిగోళ్లు (వాఘ్ నఖ్) మన దేశానికి రానున్నాయి. ఇప్పటివరకూ ఆ పులిగోళ్లు లండన్ మ్యూజియంలో వుంది. దీనిపై మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ మునిగంటి వార్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే.. దీనిని మహారాష్ట్రకి తీసుకురావడానికి ప్రభుత్వం అనేక కోట్లు ఖర్చు చేసిందన్న వాదనను మాత్రం ఖండించారు.
లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో వున్న ఈ పులిగోళ్లను తీసుకురావడానికి 14.08 లక్షలు ఖర్చైందని తెలిపారు. లండన్ నుంచి ముంబైకి చేరుకుటుందని, ఆ తర్వాత అక్కడి నుంచి సతారాకి తీసుకెళ్లి, ప్రదర్శింపబడతాయని అధికారులు తెలిపారు. సతారాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియంలో ఏడు నెలల పాటు సందర్శనార్థం వుంచుతారు. వాటిని ఓ బుల్లెట్‌ప్రూఫ్ గ్లాసులో వుంచుతారు.