చిలుకకూర
దీనిని ‘‘జలబ్రహ్మి’’ అని అంటారు.
నదుల గట్టులు, చెరువు గట్టులు మొదలయిన తేమగల ప్రదేశాలలో ఈ కూర పెరుగుతుంది.
ఇది సరస్వతి మొక్కని పోలి ఉంటుంది. నీరుగల ప్రదేశాలలో ఉండటం చేత జల బ్రహ్మి అని పేరు వచ్చింది.
దీనిలో రెండురకాల జాతులు కలవు. ఒకరకాన్ని పెద్ద చిలకూరాకు. రెండో రకాన్ని తెల్ల చిలకూరాకు అని పిలుస్తారు.
ఇది రుచిగా ఉండి బుద్దికి బలాన్ని ఇస్తుంది.
శరీరంలో జఠరాగ్ని పెంచుతుంది.
ప్లీహం, రక్తదోషం, త్రిదోషాలు, శరీర అంతర్భాగంలో క్రిములను హరిస్తుంది.
తెల్ల చిలుకకూర తియ్యగా ఉంటుంది. ఇది పిత్తాన్ని హరిస్తుంది. జ్వరంతో పాటు వచ్చే దోషాలని, త్రిదోషాలని పోగొడుతుంది.
ఇది రుచికి చేదుగా ఉంటుంది.
కడుపులో నులిపురుగులని హరిస్తుంది.
కుష్టురోగాన్ని తగ్గించే గుణంకూడా దీనిలో ఉంది.
శరీరానికి పుష్టి ఇచ్చే కూరల్లో ఇది చాలా గొప్పది.
మూలవ్యాధుల్లో, గ్రహణి రోగం అనగా బంక విరేచనాలలో, ఉబ్బు రోగాల్లో, కడుపులో బల్లలు పెరిగే రోగాల్లో ఈ ఆకుకూర వాడాలి.
మసూచి వంటి వ్యాధుల్లో చిలుకకూరాకు రసంలో తెల్ల చందనం ముద్ద ను రంగరించి తాగితే ఆ రోగం తగ్గుతుంది.