మంత్రాలయం మఠానికి క్రైస్తవ బిషప్ లు.. పీఠాధిపతితో భేటీ

మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠానికి క్రైస్తవ బిషప్ లు వచ్చారు. బళ్లారి బిషప్ రైట్ రెవ హెండ్రీ డిసౌజా, రెవ ఫాదర్ ఈవెన ఫింటో వచ్చారు. వీరికి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులతో బిషప్ లు సమావేశమయ్యారు. బళ్లారి వేదికగా నవంబర్ నెల 27 న జరిగే ఇంటర్ రిలీజియస్ సమావేశానికి ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇంటర్ రిలీజియస్ సమావేశం, హిందూ ధర్మం గురించి మాట్లాడుకున్నారు. అనంతరం క్రిస్టియన్ బిషప్ లకు స్వామీజీ రాఘవేంద్ర స్వామి చరిత్రను బహూకరించారు. ఈ సందర్భంగా థామస్ మండ్రో చేసిన సేవలను వివరించారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు బిష్‌ఫలకు రాఘవేంద్రస్వామి మెమెంటో, శేషవస్త్రం, ఫలపుష్ప మంత్రాక్షితలు పరిమళ ప్రసాదం ఇచ్చారు. అదే విదంగా బళ్లారి బిషప్‌ రైట్‌ రెవ.హెండ్రీ డిసౌజా, ఫాదర్‌ ఈవెన ఫింటోలు పట్టువస్త్రం, శాలువ గ్రంథాలను అందజేసి సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *