చుక్క కూర
ఈ చుక్కకూర బచ్చలి కూరని పోలి ఉంటుంది. పుల్లగా ఉంటుంది. అందుకే దీన్ని అన్ని ప్రాంతాలలో పుల్లబచ్చలి అంటారు. ఈ చుక్క ఆకులు దళసరిగా, పెళుసుగా ఉంటాయి. ఈ చుక్క ఆకులో జిగురు పదార్థం ఎక్కువుగా ఉంటుంది.
దీనిలో 2 రకాల జాతులు. అవి చుక్కకూర, చిన్న చుక్కకూర. ఈ చుక్కకూర పుల్లగా, తియ్యగా ఉంటుంది. చిన్న చుక్క కూర పుల్లగా కొంచం వగరుగా ఉంటుంది. ఇది జఠరాగ్ని పెంచుతుంది. ఇది రుచిని పుట్టిస్తుంది.
కఫం, వాతం పోగొడుతోంది. పిత్తాన్ని కలిగిస్తుంది. గ్రహణి, మూలరోగం, అతిసారం, కుష్టువులను నశింపచేస్తుంది. మలబద్దకాన్ని తొలగిస్తుంది. నోటిలో కొంతమందికి అతిగా లాలాజలం ఊరుతుంది. అది కఫ సంబంధమైన సమస్య. ఇలాంతి వారు చుక్కకూర తరచుగా తీసుకోవడం అద్బుతంగా పనిచేయును. వాంతులని అరికట్టడంలో ఈ కూర అద్బుతంగా పనిచేస్తుంది.
వేడిశరీరం కలవారికి ఈ కూర చాలా మేలు చేస్తుంది. జీర్ణకోశంలో ఏర్పడే మంటని, వేడిని ఇది తగ్గిస్తుంది. పైత్యం అధికం అవ్వడం వలన కలిగే విరేచనాలని, రక్తంతో కూడియున్న బంక విరేచనాలని తగ్గించడంలో చుక్కకూర చాలా అద్బుతంగా పనిచేస్తుంది. మూలరోగాలు , గుల్మాలు, క్షయలు , మేహవ్యాధులు మొదలయిన వ్యాధుల్లో ఈ కూరని ఉపయోగించటం వలన మంచి ఫలితాలు ఉంటాయి.
గుండెజబ్బులు కలవారు, ఆమవాతం, గుండెల్లో నొప్పిని తగ్గిస్తుంది. విషదోషాలు పొగొదుతుంది. శరీరంలొ ఉత్సాహాన్ని కలిగిస్తుంది. పక్వము అవ్వని గట్టిగా ఉండే వ్రణాల పైన చుక్క ఆకు వేసి కడితే బాగా పనిచేస్తుంది. చుక్క ఆకు వెచ్చచేసి దాని రసం చెవిలో పిండితే చెవిపోటు నయం అవుతుంది. తెలంగాణా ఏరియాలో దీన్ని ఎక్కువుగా వాడతారు.
– ఉషాలావణ్య పప్పు