బ్రహ్మోస్ శక్తి పాకిస్తాన్ కి బాగా తెలుసు.. కావాలంటే అడగండి : సీఎం యోగి

భారత్ బ్రహ్మోస్ క్షిపణుల ప్రభావం పాకిస్తాన్ కి బాగా తెలుసని, ఇంకా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే పాక్ ని అడగాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించిందన్నారు. లక్నోలో యూపీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ లో బ్రహ్మోస్ సూపర్ సోనికక్ క్రూజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ ను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ లో భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించడం వల్ల వాటి శక్తి ప్రపంచ దేశాలకూ తెలిసొచ్చిందన్నారు.

 

ఉగ్రవాదం అనేది కుక్కతోక వంటిదని, దానిని సరిచేయాలంటే వారి సొంత భాషలోనే బదులివ్వాలన్నారు. ఇక నుంచి ఏ ఉగ్రదాడి జరిగినా… దానిని యుద్ధంగానే పరిగణిస్తామని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారని యోగి గుర్తు చేశారు. ఉగ్రవాదం ఎన్నటికీ ప్రేమ అన్న భాషను ఒప్పుకోదని, ఎందుకంటే దానికి ఆపరేషన్ సిందూర్ లాంటి భాషలోనే చెప్పాలన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి భారత్ ఓ సందేశాన్ని పంపిందన్నారు. మరోవైపు  300 కోట్ల యూనిట్ తో ఈ యూనిట్ ను నిర్మించామని ఏటా 80 నుంచి 100 క్షిపణులను తయారు చేస్తున్నట్లు సీఎం యోగి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *