సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే మహా కుంభమేళా 2025 లోగో ఆవిష్కరణ

రాబోయే మహా కుంభమేళా 2025 కి సంబంధించిన లోగోను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవిష్కరించారు. ఈ లోగోలో మొదట ‘‘సర్వసిద్ధి ప్రద: కుంభ:’’అని రాసుంది. అలాగే ఉజ్జయిని క్షేత్రం, సాధు సంతులు నమస్కార భంగిమలో వుండే ఫొటోలు, కలశం బొమ్మలున్నాయి.అలాగే అత్యంత పవిత్రమైన త్రివేణి సంగమం కూడా వుంది. వాటి కింద మహాకుంభ 2025 అని రాసుంది. అలాగే సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా వుంది. మరోవైపు లోగోతో పాటు మహా కుంభమేళాకి సంబంధించిన వెబ్ సైట్, యాప్ ను కూడా ఆవిష్కరించారు.ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పండుగలలో ఒకటైన మహాకుంభ్ కోసం లోగో దాని ఆధ్యాత్మిక సారాంశం మరియు సాంస్కృతిక వైభవం రెండింటినీ సంగ్రహిస్తూ, అందర్నీ ఆకర్షించేలా రూపొందించబడింది.ప్రతి చోటా ఈ లోగోను ప్రదర్శించాలని, సన్నాహాలు కూడా చేయాలని సూచించారు. మేళా సందర్భంగా సీసీటీవీలు అన్ని చోట్లా పెట్టాలని, ఏర్పాట్లన్నీ క్రమ పద్ధతిలో సాగుతున్నాయని సీఎం వివరించారు. అధికారులు, శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

 

ఇప్పటి వరకు 13 అఖాడాలు, పురోహితులు, వివిధ పీఠాధిపతులు, సాధు సంతులతో సమావేశాలు నిర్వహించామని యోగి వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వున్నామని, పనులు కూడా చేస్తున్నామని అన్నారు. 2019 కుంభామేళా అత్యంత వైభవంగా నిర్వహించామని, ప్రపంచ దృష్టిని ఆకర్షించామన్నారు. దాదాపు 24 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారని గుర్తు చేశారు. ప్రయాగ్ రాజ్ లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, సకల సౌకర్యాలూ కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

కుంభమేళాకు 30 నుంచి 50కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. వివిధ నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు 6,580 సాధారణ రైళ్లతో పాటు 992 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. 2019లో జరిగిన కుంభమేళాకు 24 కోట్ల మందికిపైగా ప్రజలు హాజరైనట్లు ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ఆ సమయంలో 5వేల సాధారణ, అదనంగా 694 ప్రత్యేక రైళ్లను నడిపించినట్లు తెలిపారు. ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రస్తుతం ప్రత్యేక రైళ్ల సంఖ్యను 42శాతం పెంచి 992 నడిపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇంకా రైళ్లను పెంచాల్సిన అవసరం ఉంటే.. బ్యాకప్‌ ప్లాన్‌తో సిద్ధంగా ఉన్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *