నల్గొండలో మహాశక్తి సంగమం

‘‘సంఘటిత భారత్‌ సమర్ధ భారత్‌. సంఘటిత భారత్‌ స్వాభిమాన భారత్‌. సంఘటిత భారత్‌ సమగ్ర భారత్‌. అటువంటి సంఘటిత భారత్‌ను రూపొందించడంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలి. ఇదే ఈ హిందూ శక్తి సంగమం సందేశం’’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ కార్యవాహ మాననీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే అన్నారు. ప్రపంచానికి భారత్‌ ఆశాకిరణం అయితే, భారత్‌కు హిందూ సమాజం ఆధారం. ఆ హిందూ సమాజ సంఘటన కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ 90 ఏళ్ళకు పైగా కృషి చేస్తున్నది అని ఆయన అన్నారు. నల్గొండలోని ఎన్‌.జి. కళాశాల మైదాన ప్రాంగణంలో ‘హిందూ శక్తి సంగమం’ పేరుతో జరిగిన జిల్లా మహా సాంఘిక్‌ సార్వజని కోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ప్రాచీన సంస్కృతీ సభ్యతలే భారత్‌ గుర్తింపు. ఈ సాంస్కృతిక విలువలను జీవితంలో ఎంతవరకు ఆచరిస్తున్నామన్నది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. కులం, ప్రాంతం, భాష, మొదలైన విభేదాలను పక్కన పెట్టి మనమంతా హిందు వుల మనే విషయాన్ని గుర్తించాలి. కానీ విచిత్రమే మిటంటే విభజన వాదాన్ని రెచ్చగొట్టే విధానం సెక్యులర్‌గా గుర్తింపు పొందుతుంటే, సమైక్య, సంఘటిత వాదాన్ని గుర్తుచేయడం మతతత్వం, కమ్యూనల్‌ అవుతోందని శ్రీ హోసబలే అన్నారు. ఇక్కడ జన్మించి, ఈ దేశ సంస్కృతిని గౌరవించి, సొంతంచేసుకుని, ఆచరించేవారంతా హిందువు లేనని ఆయన అన్నారు.

హిందూ జనశక్తి జాగరణకు శాఖా కార్యక్రమం. దేశం మొత్తంలో 50వేలకు పైగా శాఖలు నడుస్తున్నాయి. వీటి ద్వారా భేదభావాలు, హెచ్చు తగ్గుల భావాలు లేని హిందూ సమాజాన్ని నిర్మాణం చేయడమే ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతం, లక్ష్యం, తపస్సు. దేశం మొత్తంలో లక్షన్నరకుపైగా సేవా కార్యక్రమాలను స్వయంసేవకులు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా సంఘటిత, సమర్ధ సమాజాన్ని నిర్మాణం చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతూ శ్రీ హోసబలే తన ఉపన్యాసాన్ని ముగించారు.

కార్యక్రమంలో ప్రముఖ కంటివైద్య నిపుణులు డా. కస్తూరి నందు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అలాగే ప్రాంత సంఘచాలక్‌ శ్రీ బూర్ల దక్షిణా మూర్తి, నల్గొండ జిల్లా సంఘచాలక్‌ శ్రీ ఇటికాల కృష్ణయ్య కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు పట్టణంలో జరిగిన పథ సంచలన్‌ (రూట్‌ మార్చ్‌) కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. మూడు వేరువేరు మార్గాల్లో సాగిన మూడు సంచలన్‌లు చివరికి ఒకచోట కలిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *