ఆఫ్ఘనిస్తాన్‌ ‌పరిణామాలు – భారత్‌ ‌నేర్చుకోవాల్సిన పాఠం

ప్రపంచంలో మరోసారి ఆఫ్ఘనిస్తాన్‌ ‌పతాక వార్తలకెక్కింది. ఒకప్పుడు భిన్న ధృవప్రపంచంలో రష్యా (రష్యా, అమెరికా) కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో కాలుమోపి రాజ్యం చెలాయించింది. దశాబ్ద కాలంగా అమెరికా ఆ పని చేసింది. తాలిబన్‌ల నుంచి ఆఫ్ఘన్‌కు విముక్తి కల్పించేందుకు ప్రయత్నిం చింది. ట్రంప్‌ అధ్యక్ష పీఠం దిగగానే అమెరికా వైఖరి మారింది. క్రమంగా సైన్యాన్ని విరమించు కోవడంతో తాలిబన్‌లకు ఊతమిచ్చిన ట్లయింది. ఒకప్పటి గాంధారదేశం, భారత్‌లో ఆవిభాజ్యమైన రాజ్యం. ముస్లిం జనాభా పెరిగిన తరువాత భారత్‌ ‌నుంచి చేజారిపోయింది. ఆశ్చర్యకరంగా ముస్లిం ప్రజానీకం మీదనే, ముస్లిం మత రాజ్యాధికారుల మీదనే తాలిబన్‌లు ఇస్లాం పేర దాడిచేయడం, కాబుల్‌ను వశపరచుకోవడం, ఇస్లాం దేశాల మధ్య ఉన్న సయోధ్యలోని డొల్లతనాన్ని ఇస్లాం పేర ముస్లిం విశ్వవ్యాప్త సౌభ్రాతృత్వం విషయమై ఓసంశయాన్ని బట్టబయలు చేసింది. అయితే బలమైన భారత్‌ ‌నాయకత్వానికి జడిసి భారతీయుల్ని మాత్రం స్వేచ్ఛగా స్వదేశం వెళ్లేందుకు భారత్‌ ‌దౌత్యపరంగా చేసిన ప్రయత్నాన్ని తాలిబన్‌లు అడ్డుకోలేదు. తాజాగా కాబుల్‌ ‌విమానాశ్రయం వెలుపల ఆత్మాహుతి దాడి జరగడం 100కు పైగా జనం మరణించడం, అనేక మంది అమెరికా సైనికులు మరణించడం, ఇందుకు కారణమైన ఐఎన్‌ఖోరాసన్‌ ‌ప్రాంతీయ ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ఉ‌గ్రదళం పట్ల బైడెన్‌ ‌కారాలు మిరియాలు నూరడం ఆందోళన కలిగించే విషయం కాబుల్‌ను కైవసం చేసుకున్న తాలిబన్‌లు తాము మారిపోయామని ప్రపంచ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కాని వారి ఉనికిపట్ల ఉగ్రవాద ముఠాలే అసహ నంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాలిబన్‌లు పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందారు. తాలిబన్‌లు కాబుల్‌ను కైవసం చేసుకోవడంతో పాకిస్తాన్‌ ‌జబ్బలు చరుచుకుంది. తాలిబన్‌లకు రష్యా, చైనా, పాకిస్తాన్‌లు మద్దతు ప్రకటించడం వివాదాస్పద మవుతున్నది. భారత్‌లో ఉగ్రవాదానికి ఊతమి చ్చేందుకు జరిగే కుట్రగా విశ్లేషకులు భావిస్తున్నారు. కాని తాలిబన్‌లకిపుడు అఫ్ఘనిస్తాన్‌లో ఐఎస్‌ఐతో వైరం ముంచుకొచ్చింది. తాలిబాన్‌లు అఫ్ఘాన్‌ను వశపరచుకోవడం అమెరికా, తాలిబన్‌ల మధ్య జరిగిన ఒప్పందంగా జీహాదీ సిద్ధాంతానికి తామే మూలం అన్న రీతిలో వ్యవహరించే ఐఎస్‌ఐ ‌భావిస్తోంది. వారికి అమెరికా పట్ల గల వ్యతిరేకత తాలబన్‌ల వ్యతిరేకతగా మారింది. అఫ్ఘాన్‌లో తాలిబన్‌లు, ఐఎస్‌ఐ ఇద్దరూ సున్నీవర్గం వారే అయినా వాళ్లలో వాళ్లే పోట్లాడుకునే పరిస్థితి దాపురించింది.

మరోపక్క తాలిబన్‌లను పంజ్‌షేర్‌ ‌దళాలు కూడా సవాలు చేస్తున్నాయి. పంజ్‌షేర్‌ ‌లోయ కాబుల్‌కు ఉత్తరాన 80 కి.మీ. దూరంలో ప్రారంభ మవుతుంది. తాలిబన్‌లకు తాము లొంగమని వారు స్పష్టం చేస్తున్నారు. గతంలో ఈ లోయలోని పోరాట యోధులు రష్యా సేనలను కూడా ప్రతిఘటించారు. దీన్ని పాపులర్‌ ‌రెసిస్టెన్స్ ‌ఫ్రంట్‌ అం‌టున్నారు. ఈ ఫ్రంట్‌లో చేరడానికి అనేక మంది ఆఫ్ఘన్‌ ‌నేషనల్‌ ఆర్మీ సైనికులు పంజ్‌షేర్‌ ‌చేరుకున్నారు. అఫ్ఘాన్‌ ‌తమ మాతృ భూమి అని, మాతృభూమి స్వేచ్ఛను తాము కాపాడుకో వాలనుకుంటున్నామని వారంటున్నారు. పంజ్‌షేర్‌ అం‌టే ఐదు సింహాలు అని అర్థం. సుమారు 9000 మంది ఈ దళంలో ఉన్నారు. తాలిబన్‌లు మొదట శాంతివచనాలు పలికినా తమ పంథా మార్చుకో లేదు. ప్రజాస్వామ్య యుతంగా కాకుండా షరియా చట్టం కింద పాలన ఉంటుందని తాలిబన్‌లు స్పష్టంగా ప్రకటించారు. షరియా చట్టంతో మహిళలు భయపడిపోతారు. షరియా ప్రకారం బుర్జా, హిజబ్‌ ‌వంటి దుస్తులు ధరించాలి. దేశీయ టీవి ఛానళ్లు, రేడియో స్టేషన్‌లలో మహిళలు పనిచేయకూడదని నిషేధించారు.

లైంగిక బానిసత్వ ప్రమాదంలోకి వెళ్లిపోతామని అఫ్ఘాన్‌ ‌మహిళలు భయపడ్తున్నారు. భారత్‌లో అన్ని రకాల స్వేచ్ఛను అనుభవిస్తున్న ముస్లిం సోదర సోదరీమణులు ఆఫ్ఘన్‌ ‌పరిస్థితిని చూసి భారత్‌పట్ల మమత్వం పెంచుకోవాలి. ముస్లింలను ఓటు బ్యాంకుగా భావించి వారిలో అభద్రతా భావం నూరిపోస్తున్న కుహానా మేధావులు, కపట కమ్యూ నిస్టులు వాస్తవాలు గ్రహించాలి. వారి శుష్కవాదాలు దైర్యముంటే ఆఫ్ఘనిస్తాన్‌ ‌వెళ్లి అక్కడ వినిపించి తాలిబన్‌లను, ఐఎస్‌ఐ ‌దళాలను సంస్కరించే ప్రయత్నం చేయాలి. స్వాభిమాన హిందువులు, సక్రియాత్మక హిందువులై వేర్పాటు వాదులపట్ల, ఉగ్రవాదులపట్ల అప్రమత్తమై సమైక్యం కావాలి.

– తాడేపల్లి హనుమత్‌‌ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *