దేశ విభజన విషాద గాథ
– హెచ్. వి. శేషాద్రి
1904లో బెంగాల్ విభజన, పధకం ప్రకారం ప్రారంభమై, 1905లో విభజన జరిగింది. సర్ హెన్రీ కాటన్ ‘‘భారత ఐక్యతను చెడగొట్టడమే విభజన ప్రధాన ఉద్దేశం’’ అన్నాడు. నవాబ్ సలీముల్లాఖాన్ కి రూ.1లక్ష లంచంగా ఇచ్చారు, కాని నవాబు తమ్ముడు ఖ్వాజా అతికుల్లా, ముస్లిము సముదాయం విభజనకి వ్యతిరేకమని ప్రకటించాడు.
బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ‘వందేమాతరం’ ఉద్యమం విస్తరించింది. 16 అక్టోబర్ 1905 తేదీన, 50000 మంది ప్రజలు గంగానది తీరాన రక్షాబంధనం కార్యక్రమంలో పాల్గొన్నారు. లాల్-బాల్-పాల్ త్రిమూర్తులుగా ఉద్యమాన్ని నిర్వహించారు, రవీంద్రనాథ్ టాగోర్, ఇతర నాయకులు ముందు నడిచారు. ‘వందే మాతరం’ మంత్రమై దేశాన్ని ఉత్తేజపరిచింది, ప్రజల్ని మేల్కొలిపింది.
కులం-మతం ప్రభావం ప్రజల్లో తగ్గుతోందని గమనించి, మింటో-మోర్లీలు 1906లో ‘ప్రత్యేక నియోజకవర్గం ప్రణాళిక’ సిద్ధం చేసారు.
ముస్లిం లీగ్ స్థాపన
30 డిసెంబర్1906 తేదిన, ఆగాఖాన్ శాశ్వత అధ్యక్షతన, నవాబ్ సలీముల్లాఖాన్ నాయకత్వాన, ‘ముస్లిం లీగ్’ ప్రారంభమైంది. ఆగాఖాన్ షియా ఇమామ్‌లలో, 48వ తరం వాడు. ముస్లిం లీగ్ ముఖ్యోద్దేశాలు:
అ. బ్రిటిషువారి పట్ల అమితమైన విశ్వాసం
ఆ. ముస్లిముల రాజకీయ హక్కుల పరిరక్షణ
ఇ. పై రెండు ఉద్దేశాలకి లోబడి, ఇతర వర్గాలతో సఖ్యత.
కాంగ్రెస్ పార్టీ ముస్లిం-సంతుష్టీకరణ వైఖరి: ఖిలాఫత్ అనంతర పరిణామాలు
కేరళ మోప్లా ప్రాంతంలో, ముస్లింలు హిందువుల మీద పెద్దఎత్తున దాడులు, విధ్వంసం చేసారు. ‘సర్వెంట్స్ అఫ్ ఇండియా’ సంస్థ గణాంకాల ప్రకారం,1500మందిని ఊచకోత కోశారు, 20000మందిని మతమార్పిడి చేసారు, 1లక్షమందిని ఇళ్ళనుంచి తరిమివేశారు. గర్భవతులు, ఆవులను కూడా వదిలిపెట్టలేదు. మగవాళ్ళను హత్యచేసి, ఆడవారిని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. గాంధీగారిని ‘కాఫిర్’ అని ప్రకటించారు.
పెరిగిన లీగ్ కోరికలు/డిమాండ్లు: 4 నుంచి 14 అంశాలు – విభజన ప్రణాళిక
అ. ముంబై నుంచి సింద్ ని వేరు చేయడం
ఆ. చీఔఖీ, బలూచిస్తాన్ లను పూర్తి స్థాయి గవర్నర్ల-ప్రావిన్సులను చేయడం
ఇ. పంజాబ్, బెంగాల్లలో అనుపాత (జనాభాకి అనుగుణంగా) ప్రాతినిధ్యం
ఈ. కేంద్ర శాసనసభలో 1/3 ముస్లిములు
ఉ. 14 ఇతర అంశాలు
1930లో కాంగ్రెస్ ‘పూర్ణ స్వరాజ్యం’ తీర్మానం చేసింది. అదే సంవత్సరం, ముస్లింలీగ్ అధ్యక్షుడిగా ‘ఇక్బాల్’ దేశవిభజన గురించి ఒత్తిడి తెచ్చాడు.
బ్రిటిష్-ముస్లింలీగ్- కమ్యూనిస్టుల బంధం:
మొదట్లో హిట్లర్-స్టాలిన్ ప్రపంచయుద్ధంలో కలిసినప్పుడు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ బ్రిటిషు-వ్యతిరేకతను సమర్థించారు, తరువాత 1941లో జర్మనీ రష్యామీద దాడి చేసినప్పుడు, రష్యా-బ్రిటన్ యుద్ధంలో ఒకే పక్షం అయిన తరువాత, భారత్ లో కమ్యూనిస్టులు-ముస్లింలీగ్ దగ్గరయ్యారు.
1945-46 ఎన్నికలు
లీగ్ పాకిస్తాన్ కోసం కోరిన 5 ప్రదేశాల్లో/రాష్ట్రాల్లో (జూతీశీఙఱఅమీవ) – బలూచిస్తాన్, పంజాబ్, చీఔఖీ, సింద్, బెంగాల్‌లలో – కేవలం సింద్ మరియు బెంగాల్‌లు రెండు మాత్రమే లీగ్ గెలిచింది. బలహీనపడుతున్నామనే అనుమానం రావడంతో ముస్లింలీగ్ 16 ఆగస్ట్ 1946 తేదిన ‘ప్రత్యక్షచర్య’కు పిలుపునిచ్చింది.
16 ఆగస్ట్ 1946 – ప్రత్యక్షచర్య
జిన్నా హిందువులమీద జిహాద్ ప్రకటించాడు. సింద్, బెంగాల్ ప్రదేశాల్లో/రాష్ట్రాల్లో, 16ఆగస్ట్ సెలవు ప్రకటించి మరీ, జిహాదీ మూకలు హిందువు లను దొరికినవారిని దొరికినట్టే ఊచకోతకి గురిచేసారు. ఈ రాష్ట్రాల్లో, 70% పొలీసులు ముస్లిములైనందువల్ల, వారు ఆ మూకలతో కలిసిపోయారు. బెంగాల్లో ప్రధాని సుహ్రావర్ది పాల్గొన్న సమావేశంలో, వక్తలందరూ హిందువులపై జిహాద్ చేయమని పిలుపునిచ్చారు. హిందువులు ఎదురుతిరగగానే, సైన్యాన్ని రప్పించారు. ఒక్క కలకత్తా మహానగరంలోనే 10000 స్త్రీపురుషులని చంపేశారు, 15000మంది గాయపడ్డారు, 1లక్షకి పైగా ప్రజలు నిర్వాసితులయారు.
తరువాత నౌఖలిలో మారణకాండ మొదలు పెట్టారు. ఒక విదేశీ వనిత మిస్ మ్యురల్ లెస్టర్ 6నవంబర్1946 ఒక క్యాంపు నుంచి వ్రాసింది, ‘‘స్త్రీలు తమ భర్తలు హత్యచేయబడటం చూడడమే కాక, ఆ స్త్రీలనే బలవంతంగా మతమార్పిడి చేసి, వారి భర్తలను చంపినవారితోనే వారికి పెళ్లిళ్లు చేసారు. ముల్లాలు, మౌల్వీలు జిహాదీలతో పాటు ఉండి, మతమార్పిడిలు చేయించారు’’. సుచేత, ఆచార్య కృపలానీలు గవర్నర్ ను కలిసి సామూహిక హత్యలు, మతమార్పిడుల గురించి చెప్పగా, ముస్లిముల కన్నా హిందూ స్త్రీలు అందంగా ఉంటారు కాబట్టి అది సహజమే అన్నాడు.
మహాప్రళయం
‘‘ఎటువంటి రక్తపాతం, అల్లర్లు ఉండవని నేను హామీ ఇస్తున్నాను, నేను సైనికుణ్ణి, సామాన్య పౌరుణ్ణి కాదు’’అంటూ మౌంట్ బాటన్ ప్రగల్భాలు పలికాడు. భారతచరిత్రలో ఎన్నడూ ఎవరూ చూడని మహా ప్రళయం సంభవించింది. కాంగ్రెస్ నిరాకరించిన జనాభా బదలాయింపు మొదలైంది. జనం కుటుంబాలతో మూటాముల్లె సర్దుకుని ఎడ్లబండ్లలో, కాలినడకన ప్రయాణమై వస్తుంటే, వేలాది మందిని చంపేసి, దోపిడీ చేసారు. ప్రపంచచరిత్రలో అంతకుముందు కనీవినీ ఎరుగని అతిపెద్ద జనాభా మార్పిడి ఇది. రాజధాని ఢిల్లీలో అతి ప్రమాదకర పరిస్థితి ఉత్పన్నమౌతోంది. ఢిల్లీలో ప్రతి 4వ వ్యక్తి, పాకిస్తాన్ నుంచి భారతానికి వచ్చిన హిందూ లేక సికు? కాందిశీకుడే. అలా దిక్కులేనివాళ్లైన వారు ముస్లిముల మీద, కాంగ్రెస్ మీద ఆగ్రహంగా ఉన్నారు.
బాధితులకు ఆర్‌ఎస్‌ఎస్ సహాయం
పోలీసుల్లో ఎక్కువ శాతం ముస్లిములే. ‘హిందూ అధికారులను హత్యచేసి, పాకిస్తాన్ జెండాను ఢిల్లీ ఎర్రకోట మీద 10 సెప్టెంబర్ 1947నఎగరవేసే కుట్ర గురించి ఆర్‌ఎస్‌ఎస్ యువకార్యకర్తలు పటేల్, నెహ్రులకు సమయానికి హెచ్చరించగలిగారని నాకు తెలిసింది’ అని భారతరత్న భగవాన్ దాస్ చెప్పారు. లక్షలాది హిందువులను చంపి, మిగతావాళ్ళ మతం మార్చాలని కుట్ర జరిగింది. రూ.55 కోట్లు అదనంగా పాకిస్తాన్‌కు ఇవ్వాలని పట్టుబట్టి గాంధీగారు నిరాహారదీక్ష మొదలుపెట్టారు.
ఆ కాలంలో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు చూపిన ధైర్యం, సేవాతత్పరత గురించి ఏ.ఎన్.బాలి ఇలా అన్నారు – ‘‘పశ్చిమ పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రతి కాందిశీకుడు, భారతలో ఎక్కడున్నా, ఆర్‌ఎస్‌ఎస్ వారికి ఎల్లప్పుడూ ఋణపడిఉంటారు. కాందిశీకులను అందరూ దిక్కులేనివారిలా వదిలేస్తే, ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ళు మాత్రం ఎనలేని సహాయం చేశారు.’’
విభజన ఎందుకు ఆపలేకపోయాం?
- కాంగ్రెస్‌లో సైద్ధాంతిక బలం లేకపోవడం. జాతీయవాదభావం లేక, దేశం అంటే కేవలం భౌగోళిక ప్రాంతాలు, రాజకీయాలు మాత్రమే అనుకోవడం ప్రధాన కారణం.
- జాతీయ నిబద్ధత లేకపోవడం- స్వాతంత్య్రం -స్వరాజ్యం ఎందుకు అనే విషయం మర్చిపోయారు. స్వాతంత్య్ర సమర స్ఫూర్తి, ఆదార్శాలు, ఆకాంక్షలు అన్నీ గాలికొదిలేశారు.
- అన్నదమ్ములమధ్య విబేధాలు, విభజన లాగా చూసారు. కానీ తల్లిని ముక్కలు చేస్తారా?
- జాతీయ సమైక్యత, సమగ్రతల కన్నా, ముస్లిం సంతుష్టీకరణ ఎక్కువైంది. హిందూ-ముస్లిం ఐక్యత లేకపోతే స్వాతంత్య్రం అఖర్లేదు అన్నారు. దానికి బదులుగా, ‘మీరు మాతో కలిస్తే, మీతో పాటుబీ మీరు మాతో కలవకపోతే, మీరు లేకున్నా మేము ముందుకి వెళ్తాముబీ మీరు మమ్మల్ని వ్యతిరేకిస్తే, మిమ్మల్ని దాటుకుని వెళ్తాము’ అనే విధానం ఉండాల్సింది.
- ప్రఖ్యాత చరిత్రకారుడు ‘అర్నాల్డ్ టోయన్బీ’, ‘‘అసలు పాకిస్తాన్ ఏంటి? భారతదేశాన్ని పూర్తిగా పరాజితను చేయాలన్న 1200సంవత్సరాల ముస్లిముల కలను మొదటిసారి 20వ శతాబ్దంలో సాధించారు’’ అన్నారు.
- శరత్ చంద్ర చటర్జీ ఇలా వ్రాసారు – ‘‘అమెరికన్లు తమ స్వాతంత్య్రం కోసం పోరాడి నప్పుడు, సగంపైగా ప్రజలు బ్రిటిషువారితోనే ఉన్నారు. ఐరిష్ పోరాటంలో, నిజానికి ఎంతమంది పోరాటంలో పాల్గొన్నారు? ఎంత మంది ఏ పోరాటంలో ఉన్నారని సంఖ్య లెక్క పెట్టుకోవడం కాదు, ఆ ధ్యేయసాధనకై చేసిన తపస్సు, దాని తేజస్సు-తీక్షణతలపై తప్పొప్పుల నిర్ణయం జరుగుతుంది. ‘హిందూ-ముస్లిం ఐక్యత లేకుండా, స్వరాజ్యం లేదు అనడం’ హిందువులకి ఘోర అవమానం’’.
- డా. రామమనోహర్ లోహియా ఇలా అంటారు, ‘‘క్షీణించిన కాంగ్రెస్ నాయకత్వం, భయంకరమైన మతఘర్షణలు, విభజనకు కారణమైనాయి. యువ నాయకత్వం ఉంటె దేశవిభజన జరిగి ఉండేది కాదు. ఆ సమయంలో ఏ ఒక్క నాయకుడు జైల్లో లేడు. విభజన కాలంలో నేను ఏమీ చేయలేదని చాలా బాధపడుతున్నాను.’’
- 1960లో లియోనార్డ్ మోస్లితో మాట్లాడుతూ నెహ్రూ ఇలా అన్నారు – ‘‘మేము అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నాము, అలసిపోయాము. మళ్ళి జైలుకి వెళ్ళే ఓపికలేదు. మాకు అఖండ అవిభాజిత భారతం కావాలని అడిగితే, జైలుకి వెళ్ళేవాళ్లము.’’ (లియోనార్డ్ మోస్లి – ది బ్రిటిష్ రాజ్’ నుంచి).