”సర్వేపల్లి అంతటివాడు కావాలనే ఆ పేరు పెట్టాం” : సీపీ రాధాకృష్ణ మాతృమూర్తి
ఎన్డీయే పక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆయన మాతృమూర్తి జానకీ అమ్మాళ్ హర్షం వ్యక్తం చేశారు.మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అంతటివాడు కావాలని ఆకాంక్షించే తన కుమారుడికి ఆయన పేరు పెట్టామని, ఆ నమ్మకం ఇప్పుడు నిజమైందని ఎన్‌డీఏ తరఫున అభ్యర్థి అయిన సీపీ రాధాకృష్ణన్ మాతృమూర్తి జానకి అమ్మాళ్ భావోద్వేగానికి గురయ్యారు. తిరుప్పూర్‌లో నివాసముంటున్న జానకి అమ్మాళ్ వద్దకు సోమవారం బీజేపీ నేతలు, కార్యకర్తలు తరలివెళ్లి ఆమెకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తన కుమారుడిని ఉపరాష్ట్రపతి పదవికి సిఫారసు చేసిన బీజేపీకి, ప్రధాని మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.