ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌కార్యకర్తపై సి.పి.ఎం దాడి

కేరళ రాష్ట్రంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌కార్యకర్తలపై, హిందూ సంఘాల నాయకులపై దాడులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ‌ప్రకియ నెమ్మదిగా సాగుతోందని ఒక దినపత్రికలో ప్రచురితమైన నివేదికను సోషల్‌ ‌మీడియాలో షేర్‌ ‌చేసినందుకు ఒక ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌కార్యకర్తపై సి.పి.ఎం నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని నేదుంకాండం జిల్లాలో జరిగింది.

 సి.పి.ఎం నేతృత్వంలోని కేరళ రాష్ట్ర ప్రభుత్వ హయంలో కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌పక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మళయాళ దినపత్రిక జన్మభూమి ఒక నివేదికను ప్రచురించింది. వ్యాక్సినేషన్‌ ‌పక్రియలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తోందని, రాజకీయ లబ్ధి కోసం వ్యాక్సినేషన్‌ను ఉపయోగించు కుంటుందని నివేదికలో ఉంది. ఈ నివేదికను తైకేరి ప్రకాష్‌ అనే ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌కార్యకర్త తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఈ నివేదికను సోషల్‌ ‌మీడియాలో పోస్టు చేయడంతో స్థానిక ప్రజలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించారు. ఇది స్థానికంగా గందరగోళానికి దారి తీసింది. దీంతో ఆగ్రహానికి గురైన సి.పి.ఎం కార్యకర్తలు ఆగస్టు 1న రాత్రి 9.30కి ప్రకాష్‌ ఇం‌టికి వెళ్తున్న సమయంలో అతని వాహనంపై దాడికి దిగారు. అతని ముఖం, చేతులపై కత్తులతో పొడిచారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న ప్రకాష్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ప్రకాష్‌ ‌పై జరిగిన హింసాత్మక దాడికి ఫేస్‌బుక్‌ ‌పోస్ట్ ‌కారణమని పోలీసులు భావిస్తున్నారు.

కేరళలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలపై హింసాత్మక దాడుల సంఘటనలు పెరుగుతూ ఉన్నాయి. కమ్మూనిస్టు పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిత్యం దాడులకు పాల్పడుతూనే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌కార్యకర్త అయిన నందు కృష్ణను సి.పి.ఎం కార్యకర్తలు కత్తులతో దాడి చేసి చంపేశారు. అదే సమయంలో S.D.P.I కార్యకర్తల చేతిలో మరో ముగ్గురు ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *